Begin typing your search above and press return to search.
మహేష్ హీరోయిన్ పెళ్లి చేసుకొంటోంది
By: Tupaki Desk | 15 May 2016 6:52 AM GMTమహేష్ లాంటి స్టార్ హీరో సరసన నటించిన హీరోయిన్ పెళ్లంటే అందరికీ తెలిసిపోతుంది. వారం రోజుల ముందుగానే ఆ పెళ్లికి సంబంధించిన హడావుడి మొదలైపోతుంటుంది. కానీ ఓ భామ మాత్రం అందుకు భిన్నంగా సీక్రెట్ గా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. సీక్రెట్ గా అంటే పరిమిత సంఖ్యలో సన్నిహితుల్ని మాత్రమే పిలిచి పెళ్లి చేసుకొంటోందట. అంత సీక్రెట్ ఎందుకమ్మా అంటే నాకిలాగే పెళ్లి చేసుకోవాలనుంది అనిచెబుతోంది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనేగా మీ సందేహం. అతిథి సినిమాలో మహేష్ తో ఆడిపాడిన అమృతారావు. అందమైన ఈ భామ అతిథిలో నటిస్తున్నప్పుడు మహేష్ పై మనసు పారేసుకొందని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆ సినిమా హిట్టు కాకపోవడంతో అమృతారావు టాలీవుడ్ కి దూరమైంది. బాలీవుడ్ లోనే అవకాశాలు వెదుక్కుంటూ అక్కడే అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమె అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. మధ్యలో తెలుగు నుంచి ఆఫర్లు వెళ్లినా నిర్మాతల ముందు రకరకాల డిమాండ్లు వుంచడంతో ఇక ఆమెపై ఎవరూ ఆసక్తి చూపలేదు. అలా తెలుగులోనూ ఆమె కెరీర్ కి పుల్ స్టాప్ పడిపోయింది. కొంతకాలంగా చడీచప్పుడు లేకుండా గడుపుతున్న ఆమె రేడియో జాకీ అన్మోల్ తో ప్రేమలో పడిందట. ఆ ప్రేమ పెళ్లికి దారితీసినట్టు సమాచారం.
ఇంట్లోవాళ్లని ఒప్పించే పెళ్లి చేసుకుంటున్నా అది సీక్రెట్ పరమిత సంఖ్యలో బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ రోజే పెళ్లి చేసుకొంటోందని సమాచారం. పెళ్లి తర్వాత రిసెప్షన్ కి మాత్రం అందర్నీ ఆహ్వానిస్తుందట. మరి ఆ ఆహ్వానితుల్లో మహేష్ ఉన్నాడో లేడో!