Begin typing your search above and press return to search.

నైట్ పార్టీలో నాటీ అందాలు..!

By:  Tupaki Desk   |   29 Oct 2022 12:30 AM GMT
నైట్ పార్టీలో నాటీ అందాలు..!
X
బాలీవుడ్ హీరోయిన్స్ లో కొన్ని సినిమాలే చేసినా తనకంటూ ఒక మార్క్ వేసుకుంది అమృత అరోరా. MTv లో వీజే గా మొదలైన అమ్మడి కెరియర్ ఆ క్రేజ్ తో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. కెరియర్ మొదట్లోనే చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అవగా లెస్బియన్ సినిమా గర్ళ్ ఫ్రెండ్ తో తొలి హిట్ కొట్టింది అమృత. 2002 నుంచి 2009 వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన అమృత అరోరా ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలకు దూరమైంది.

అప్పట్లో హీరోయిన్స్ కి పెళ్లి జరిగితే ఇక వారి కెరియర్ ముగిసినట్టే. ఆ క్రమంలోనే పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది అమృత. అయితే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 2015లో ఒక సినిమాలో నటించింది.

అమృత అరోరా సినిమాలు చేయకపోయినా ఆమె ప్లేస్ లో ఆమె సోదరి మలైకా అరోరా బాలీవుడ్ లోకి వచ్చింది. మలైకా దూకుడు గురించి అందరికి తెలిసిందే. అమ్మడు స్పెషల్ సాంగ్స్ కి క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు.

అమృతని ఇష్టపడే వారికి మలైకా కూడా ఆల్టర్నేట్ గా మారింది. అందుకే ఆమెకు సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. సినిమాలకు దూరమైనా సరే అమృత అరోరా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. ఇక బాలీవుడ్ పార్టీల్లో అమృత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.ఇప్పటికీ సినిమాలు చేయకపోయినా సరే అమృత అదే ఫాలోయింగ్ కొనసాగిస్తుంది.

లేటెస్ట్ గా అమృత తన ఫ్యామిలీతో నైట్ పార్టీలో పాల్గొన్నది. పార్టీ పూర్తి టైం లో అమృతని మీడియా కెమెరాలు క్లిక్ అనిపించాయి. టాప్ గా షర్ట్ ఒకటి వేసుకున్న అమ్మడు ఈ వయసులో కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది.

పస్తుతం అమృత అరోరా ఈ స్పెషల్ ఫోటోస్ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ మూడ్ లో ఉన్న అమ్మడు ఇప్పటికీ తన అందంతో ఎట్రాక్ట్ చేస్తుంది. మళ్లీ ఈమధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అమృత సరైన ఛాన్స్ వస్తే మాత్రం అసలు వదలనని అంటుంది. అమృత అరోరా లేటెస్ట్ ఫోటోలు ఆమె ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.