Begin typing your search above and press return to search.

ప్రెగ్నన్సీ ప్రశ్నతో మాజీ భార్యకు మండింది

By:  Tupaki Desk   |   5 July 2016 1:46 PM GMT
ప్రెగ్నన్సీ ప్రశ్నతో మాజీ భార్యకు మండింది
X
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. బెబో భర్త సైఫ్ అలీ ఖాన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాడు. తన భార్య బేగమ్ కరీనా కపూర్ ఖాన్ కడుపుతో ఉందని.. డిసెంబర్ లో తమకు మొదటి బిడ్డ పుట్టనున్నట్లు వెల్లడించాడు. అందాల భామ కరీనా ప్రెగ్నెంట్ అని తెలియడంతో.. చాలా మంది అభిమానులకు ఇదో హాట్ న్యూస్ అయిపోయింది. మరి సైఫ్ అలీ ఖాన్ మాజీ భార్య ఈ విషయంపై స్పందించింది.

కరీనా ప్రెగ్నెన్సీపై సైఫ్ మొదటి భార్య అమృతా సింగ్ స్పందించడం కాదు.. కరిచినంత పని చేసింది. కొందరు మీడియా జనాలు అమృతను కాంటాక్ట్ చేసి.. రియాక్షన్ అడగడం మొదలు పెట్టారు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చేసింది. 'జనాలకు ఫోన్ లు చేసి అవే ప్రశ్నలను మళ్లీ మళ్లీ అడగడానికి మీకు ఎంత ధైర్యం? అసలు అలా అడగడానికి ఎవరు మీరు? మళ్లీ నాకు ఫోన్ చేయకండి' అంటూ విరుచుకుపడిపోయిందిట అమృత. ఇదంతా ఫోన్ లోనే కాబట్టి అరిచి సరిపెట్టింది కానీ.. డైరెక్టుగా అడిగి ఉంటే.. వాళ్ల పరిస్థితి ఎలా ఉండేదో అని చాలామంది చర్చించుకుంటున్నారు.

అయినా కరీనా మూలంగా సైఫ్-అమృతలు విడిపోయి ఉంటే ఇంతగా ఫ్రస్టేట్ అయితే అర్ధం ఉంటుంది. అమృతా సింగ్ తో విడిపోయిన 8 ఏళ్ల తర్వాత కరీనాను పెళ్లాడాడు ఈ ఖాన్. సైఫ్-కరీనాలు పెళ్లి చేసుకుని కూడా 4 ఏళ్లు గడిచిపోయింది. అంటే అమృతాతో సైఫ్ విడిపోయి పుష్కరం గడిచిందన్న మాట. ఇంకా సైఫ్ గురించి అడిగితే అమృతాకు మండడంలో అర్ధం లేదేమో కదా!