Begin typing your search above and press return to search.
హాట్ కామెంట్స్ తో హడలెత్తిస్తున్న మాజీ సీఎం భార్య
By: Tupaki Desk | 5 Aug 2020 5:00 AM GMTమాజీ సీఎం భార్య చేసిన ట్వీట్ ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. మహారాష్ట్రను మొన్నటివరకు పాలించిన బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ చేసిన ట్వీట్ ఇప్పుడు ముంబైలో తీవ్ర కలకలం రేపుతోంది. రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.
సుశాంత్ కేసులో ముంబై పోలీసులు ఎటూ తేల్చకపోవడం.. బీహార్ పోలీసులకు సహకరించకపోవడంపై అమృత ఫడ్నవీస్ నిప్పులు చెరిగారు. ‘ముంబై తన మానవత్వాన్ని కోల్పోయింది. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య.. దానిపై ముంబై పోలీసుల వ్యవహార శైలి చూస్తే బతకడానికి ముంబై మహానగరం ఎంత మాత్రం సురక్షితం కాదనే అనుమానం కలుగుతోందని అమృత అన్నారు. ఇక్కడ అమాయక ప్రజలు.. ఆత్మగౌరవం ఉన్నవారు జీవించడం సురక్షితం కాదని’’ అమృత ట్వీట్ చేయడం పెను దుమారాన్ని రేపింది.
అమృత ట్వీట్ పై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మండిపడుతున్నాయి. ఆమె ట్వీట్ ముంబై పరువుతీస్తోందని.. పోలీసుల పరువు తీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముంబై పోలీసులపై నమ్మకం లేనప్పుడు తమ భద్రత కోసం ప్రైవేట్ సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఇది ముంబై పోలీసుల ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని కించపరుస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
సుశాంత్ విషయంలో ఎటూ తేల్చకుండా.. బీహార్ పోలీసులను విచారణ చేయకుండా ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం భార్య సంచలన వ్యాఖ్యలతో రాజకీయ దుమారాన్ని రేపారు.