Begin typing your search above and press return to search.

విల్ స్మిత్ చెంప దెబ్బ‌పై అమూల్ కామెడీ

By:  Tupaki Desk   |   29 March 2022 9:30 AM GMT
విల్ స్మిత్ చెంప దెబ్బ‌పై అమూల్ కామెడీ
X
94వ ఆస్కార్ వేడుక‌లో హోస్ట్ క్రిస్ రాక్ ని -హాలీవుడ్ న‌టుడు విల్ స్మిత్ చెంప మీద లాగి పెట్టి కొట్ట‌డంపై సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో మీమ్స్ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌నపై సీరియ‌స్ అయ్యే వ‌ర్గం ప‌క్క‌న‌బెడితే కామెడీ షోలు మాత్రం ఓ రేంజ్ లో హైలైట్ అవుతున్నాయి. క్రిస్ రాక్- విల్ స్మిత్ ని పెద్ద కమెడియ‌న్స్ గా మార్చేస్తున్నారు నెటిజ‌న్స్.

స‌రిగ్గా లాగి పెట్టి లెంప‌కాయ కొట్టే స‌న్నివేశం స‌మ‌యంలో విల్ స్మిత్ ఎమోష‌న్ ని స్లో మెష‌న్ లో క్యారీ చేయ‌డం...అదే స‌మ‌యంలో క్రిస్ రాక్ చెంప దెబ్బ‌కి ముందు ఎలా ఉన్నాడు..చెంప దెబ్బ తిన్న త‌ర్వాత ఎలాంటి ఎక్స్ ప్రెష‌న్ తో మూవ్ అయ్యాడు అనే సంద‌ర్బాల‌కి ర‌క‌ర‌కాల సిచ్వేష‌న్స్ జోడించి వైర‌ల్ చేస్తున్నారు.

తాజాగా ఈ ఘ‌ట‌న‌పై డైరీ బ్రాండ్ అమూల్ కూడా స్లాప్‌గేట్ స్పూఫ్‌తో జాబితాలో చేరిపోయింది. క్రిస్ రాక్- విల్ స్మిత్ పాత్ర‌ల‌కు యానిమేటెడ్ రూపం క్రియేట్ చేసి హాస్యాన్ని పండించే ప్ర‌య‌త్నం చేసారు.

అమూల్ వారి ఇన్‌స్టాగ్రామ్ - ట్విట్టర్ ఖాతాలలో ఒక చమత్కారమైన డూడుల్‌ను పంచుకున్నారు. అవార్డ్ నైట్‌లో క్రిస్‌ను స్మిత్ కొట్టిన ఖచ్చితమైన క్షణాన్ని అమూల్ మళ్లీ సృష్టించారు. "క్రిస్ స్లాప్ ద్వారా చతికిలబడ్డాడు!" అమూల్ రాశారు. "స్నాక్. స్మాక్ చేయవద్దు" అని జోడించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో..పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. చూసి న‌వ్వుకోవ‌డం నెటి జ‌నుల వంత్తైంది.

మొత్తానికి తాజా స‌న్నివేశం చూస్తుంటే ఆస్కార్ వేడుక‌ల్లో ముందు అంతా కామెడీ ప్రాంక్ గానే భావించారు .ఆ త‌ర్వాత సీరియ‌స్ అయింది. ఇప్పుడంతా అదే స‌న్నివేశాన్ని అంతే కామెడీగా హైలైట్ చేయ‌డం విశేషం.

94వ ఆస్కార్ వేడుక‌ల్లో హోస్ట్ చేసిన‌ క్రిస్ రాక్ ని హాలీవుడ్ న‌టుడు విల్ స్మిత్ వేదిక‌పై చెంప చెళ్లు మ‌నిపించిన ఘ‌ట‌న ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. విల్ స్మిత్ భార్య జ‌డా పింకెట్ స్మిత్ పై జోకులేయ‌డంతోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అనంత‌రం విల్ స్మిత్ వేదిక‌పైనే క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు.

దీనిపై నెటి జ‌నులు భిన్న ర‌కాలుగా స్పందించారు. కొంద‌రు క్రిస్ రాక్ ని స‌పోర్ట్ చేయ‌గా మ‌రి కొంద‌రు విల్ స్మిత్ కి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇప్ప‌టికీ ఆ వీడియో నెట్టింట దుమారం రేపుతూనే ఉంది.

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఆస్కార్ వేడుక‌ల్లో ఇలాంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం ఆస్కార్ చ‌రిత్ర‌లోనే మొట్ట మొద‌టిసారి. ఓ రకంగా ఆస్కార్ కి ఈ ఘ‌ట‌న ఓ క‌ళంకిత‌మ‌నే చెప్పాలి. ఆస్కార్ అకాడ‌మీ ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అలాగే హాస్య న‌టులు ఈ ఘ‌ట‌న‌ని తీవ్ర ప‌రిణామంగా భావిస్తున్నారు.