Begin typing your search above and press return to search.

ఎమీ 28వ బ‌ర్త్ డే .. ఆ ఒంట‌రి దీవిలో!

By:  Tupaki Desk   |   1 Feb 2020 5:19 AM GMT
ఎమీ 28వ బ‌ర్త్ డే .. ఆ ఒంట‌రి దీవిలో!
X
బ్రిటీష్ బ్యూటీ ఎమీజాక్స‌న్ ల‌వ్ లైఫ్ గురించి తెలిసిందే. తాను ప్రేమించిన ది గ్రేట్ బిజినెస్ మేన్ జార్జి ప‌నాయ‌టౌతో నిశ్చితార్థం జ‌రుపుకున్న ఈ బ్యూటీ అనంత‌రం హ్యాపీ లైఫ్ ని ఆస్వాధిస్తోంది. అయితే అంత‌కుముందే జార్జితో స‌హ‌జీవ‌నంలో ఒక బేబి బోయ్ కి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి విదిత‌మే. ఆ క్ర‌మంలోనే 2020 ఆరంభంలోనే జార్జిని పెళ్లాడేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తోంది.

ఇంత‌లోనే ఎమీ బ‌ర్త్ డే వేడుక‌ల్ని ఇదిగో ఇలా సెల‌బ్రేట్ చేస్తోంది. వాన దేవుడు జ‌ల్లులు కురిపిస్తుంటే ఆ తుంప‌ర‌లో త‌డిసి ముద్ద‌వుతోంది. లైఫ్ లో ఇంత‌కంటే ఎగ్జ‌యిటింగ్ మూవ్ మెంట్ త‌న‌కు ఇంకొక‌టి లేనే లేద‌ని చెప్ప‌క‌నే చెబుతోంది. నిన్న‌నే త‌న వారసుడు లిటిల్ జార్జితో బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ లో క‌నిపించిన ఎమీ ఇంత‌లోనే త‌న 28వ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ని గ్రాండ్ గా ప్రారంభించింది.

ప్ర‌తిసారీ త‌న బ‌ర్త్ డే వేడుక‌ల కోసం ప్రియుడు జార్జితో క‌లిసి ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌కు వెళ్లి వ‌చ్చేది. ఈసారి తూర్పు ఆఫ్రికాలోని సీచెల్స్ అనే ద్వీపం(ఐల్యాండ్)లో ఇదిగో ఇలా సెల‌బ్రేట్ చేసుకుంటోంది. ఇది రేర్ మూవ్ మెంట్. టూపీస్ లో ఎమీజాక్స‌న్ పూర్తిగా స్వేచ్ఛ‌ను ఆస్వాధిస్తోంది. వ‌ర‌ల్డ్ రిచెస్ట్ బిజినెస్ మేన్‌ జార్జితో చెలిమి.. స‌హ‌జీవ‌నం ఈ అమ్మ‌డి లైఫ్ లో జోయ్ ని పీక్స్ కి తీసుకెళ్లింద‌నే అర్థ‌మ‌వుతోంది. చివ‌రిగా ఎమీజాక్స‌న్ న‌టించిన 2.0 స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ కి కూడా ఈ బ్యూటీ హాజ‌రు కాలేదు. త‌ను తిరిగి సినిమా అనే లోకంలోకి వ‌చ్చి బిజీ అవుతుందా లేదా? అన్న‌దానిపైనా స‌రైన క్లారిటీ లేనేలేదు.