Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : అమీ ఏలా.. ఇలా రెచ్చిపోతే ఎలా..?

By:  Tupaki Desk   |   28 Oct 2022 2:30 PM GMT
ఫోటో స్టోరీ : అమీ ఏలా.. ఇలా రెచ్చిపోతే ఎలా..?
X
బాలీవుడ్ లో అందాల భామల గ్లామర్ షోకి ప్రత్యేకత ఉంటుంది. ఎలాంటి మొహమాటం లేకుండా అందాలను గుమ్మరించడంలో వారు ముందుంటారు. గ్లామర్ ట్రీట్ లో అప్ గ్రేడ్ అవుతూ ప్రేక్షకులను రంజింపచేస్తుంటారు. అలాంటి హాట్ బ్యూటీస్ లో ఒకరు అమీ ఏలా. ఇండో ఆస్ట్రేలియన్ బ్యూటీ అయిన ఈ అమ్మడు స్కిన్ షో విషయంలో అందరికన్నా రెండు అడుగులు ముందుంటుంది. ముఖ్యంగా తన పరువాలతో ఆడియన్స్ ని పిచ్చోళ్లని చేయడంలో అమ్మడికి అదో సరదా అనొచ్చు. అందుకే తన సోషల్ మీడియాలో హాట్ స్టిల్స్ తో కాకరేపుతుంది.

అంతకుముందు మోడల్ గా చేస్తూ వచ్చిన ఈ భామ మిలో మ్యూజిక్ వీడియోతో ఆడియన్స్ ని అలరించింది. ఆ టైం లోనే అమ్మడికి రన్ వే 34 సినిమాలో ఛాన్స్ దక్కింది. ఆ మూవీలో ఏంజెలినా పాత్రలో తళుక్కున మెరిసింది అమీ ఏలా.

ఇక ఆ తర్వాత టీవీ సీరీస్ లలో నటించింది అమ్మడు. కర్మ్ యుద్ధ్, గుడ్ బ్యాడ్ గర్ల్ సీరీస్ లలో నటించగా.. గోవిందా నామ్ మేరా సినిమాలో కూడా అమీ ఏలా స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది.

సినిమాల లెక్క ఎలా ఉన్నా అమ్మడు సోషల్ మీడియా ఫోటోలతో హీటెక్కించేస్తుంది. గ్లామర్ షోలో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పరచుకున్న అమీ లేటెస్ట్ గా టూ పీస్ బికినీ షోతో గ్లామర్ ఎటాక్ చేస్తుంది.

అసలే అందాల భామ.. అందులోనూ బికినీ షో.. ఇక కుర్రాళ్ల పరిస్థితి ఏంటో ఒకసారి అర్ధం చేసుకోవచ్చు. అమీ ఇలా రెచ్చిపోతే ఎలా సుమీ అంటూ ఆమె షేర్ చేసిన ఫోటోల కింద కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లే కటౌట్ ఇదని కొందరు అంటున్నారు.

సూపర్ హిట్ సినిమాల్లో నటించడం కన్నా ఇలా సూపర్ హాట్ ఫోటోలతో తన ఫాలోవర్స్ ని అలరించడంలోనే నిజమైన హ్యాపీస్ నెస్ ని వెతుక్కుంటుంది అమీ ఏలా. అందుకే ఆమె కి రోజు రోజుకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతుంది. అమ్మడు ఇలానే రెచ్చిపోతే ఖచ్చితంగా ఓ పెద్ద స్టార్ హీరో సినిమాలో మెయిల్ లీడ్ ఛాన్స్ వస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అమీ ఏలా బికినీ ట్రీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.