Begin typing your search above and press return to search.

అమీ.. ఎంతటి అందం సుమీ?

By:  Tupaki Desk   |   22 May 2017 3:41 PM IST
అమీ.. ఎంతటి అందం సుమీ?
X
పుట్టింది బ్రిటన్ లో అయినా చూడటానికి భారతీయురాలిలా కనిపించడం బ్రిటిష్ అందం అమీ జాక్సన్ కు పెద్ద అస్సెట్. అందుకే ఆమెకు ఇండియన్ సినిమాల్లో.. మరీ ముఖ్యంగా సౌత్ మూవీస్ లో అవకాశాలు తెచ్చి పెడుతున్నాయి. మదరాసు పట్టణం అనే సినిమాలో ఆర్య పక్కన హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె చేసిన వాటిలో క్రేజీ ప్రాజెక్టులే ఎక్కువ. తెలుగులో కూడా ‘ఎవడు’ సినిమాలో చరణ్ పక్కన రెండో హీరోయిన్ గా చేసింది.

అమీ జాక్సన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పెడుతూనే ఉంటుంది. తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు వెళ్లిన అమీ జాక్సన్ ‘ద స్క్వేర్’ ప్రీమియర్ సమయంలో సెల్ఫీ తీసుకుని అప్ లోడ్ చేసింది. బేసిక్ గానే అమీ అందగత్తెె. దానికి తోడు మాంచి మేకప్ తో... అందాలను ఆరబోస్తూ ఉన్న ఈ ఫొటోలో ఆమె మరింత సెక్సీగా కనిపించింది. దీంతో అక్కడున్న వారి చూపులంతా అమీవైపే ఉన్నాయి.

దర్శకుడు శంకర్ తీసిన ‘ఐ’ సినిమాతో టాప్ యాక్ట్రస్ స్థాయికి చేరాలన్న అమీ జాక్సన్ ఆశకు గండిపడింది. కానీ శంకర్ ఆమెకు మరో ఛాన్స్ ఇస్తూ రోబో సీక్వెల్ 2.0 లో రజనీకాంత్ పక్కన హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ సినిమా తనకు టర్నింగ్ పాయింట్ అవుతుందన్నది అమీ ఆశ. 2.0 లాంగ్ టైమ్ ప్రాజెక్ట్ కావడంతో మధ్యలో విరామం దొరికి ఇలా కేన్స్ లో సందడి చేయడానికి వచ్చింది.