Begin typing your search above and press return to search.
చిట్టికన్నయ్య 2.0తో అప్పుడే షికార్లేమిటి?
By: Tupaki Desk | 27 Sep 2019 7:37 AM GMTతెలుగు లోగిళ్లలో మాధురి ధీక్షిత్ ఎవరు? అంటే చెప్పలేరేమో కానీ.. 2.0 గాళ్ ఎవరు అంటే ఠకీమని చెప్పేస్తారు. రోబో గాళ్ 2.0 ఇటీవలే చిట్టి కన్నయ్య 2.0కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ రోబోగాళ్ ని పరిచయం చేయాలా? అవసరం లేదేమో!
బాలీవుడ్ సహా తెలుగు.. తమిళ పరిశ్రమల్లో మెరుపులు మెరిపించిన లండన్ బ్యూటీ అమీజాక్సన్ మల్టీమిలియనీర్ జార్జ్ పనాయటౌతో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే సహజీవనం.. ఆ క్రమంలోనే గర్భం దాల్చి ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చింది. అమ్మతనంలో కమ్మదనానికి సంబంధించిన ప్రతీ మూవ్ మెంట్ ని సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫొటోల రూపంలో పోస్ట్ చేస్తూ వచ్చింది. ఇటీవలే పండంటి బాబుకి జన్మనిచ్చిన ఎమీజాక్సన్ వారసుడికి అప్పుడే పేరు కూడా పెట్టేసింది. చిన్నారి బాలకుడి పేరు ఆండ్రియాస్. తనకు కొడుకు పుట్టాడన్న వార్తని అభిమానులతో పంచుకున్న అమీ అప్పుడే పుట్టిన బుడ్డోడితో ఇదిగో ఇలా ఫోజునిచ్చింది.
ప్రియుడు మల్టీమిలియనీర్ కావడంతో తొలి రోజు తన కోడుకుని తీసుకుని లగ్జరీ కార్ లో షికారుకు వెళ్లిందట. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో బ్లాక్ షూ వేసుకున్న అమీ తన బుడ్డోడిని కూడా తనలాగే వైట్ అండ్ వైట్ లో రెడీ చేసి బయటికి తీసుకొచ్చింది. తన కొడుకుతో ముద్దు మురిపాల వేళ పంచుకున్న సెల్ఫీలని సోషల్ మీడియా ఇన్స్టాలో తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం యువతరంలో వైరల్గా మారాయి. అమీ పోస్ట్ చేసిన ఫొటోల్లో బుడ్డోడిని చూసిన వారంతా క్యూట్ అని సంబరపడిపోతున్నారు. మరి కొంత మంది పుట్టి రెండు రోజులైనా కాలేదు. చిన్ని పిల్లాడితో సెల్ఫీలు, షికార్లేమిటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమీ- జార్జ్ల వివాహం వచ్చే ఏడాది గ్రీస్ లో జరగనుంది.