Begin typing your search above and press return to search.
అందాల రాశిని అంత కష్టపెట్టిస్తున్నావా శంకర్
By: Tupaki Desk | 10 Sep 2016 9:30 AM GMTఅమీ జాక్సన్ అనగానే ఆమె హాట్ హాట్ అందాలు.. క్లీవేజ్ షోలు.. మైండ్ బ్లోయింగ్ ఫొటో షూట్లే గుర్తుకొస్తాయి. పుట్టింది పెరిగింది లండన్ లో కదా.. ఆమెకు ఇదంతా అంత బోల్డుగా అనిపించదు. మనకు మాత్రం డోస్ మరీ
ఎక్కువలాగా అనిపిస్తుంది. ఐతే ఇప్పటిదాకా అమీని గ్లామర్ కోణంలోనే చూశాం కానీ.. శంకర్ మాత్రం ఆమెను మరోరకంగా ప్రెజెంట్ చేయబోతున్నాడు. ‘రోబో-2’ కోసం అమీ పాత్రను పూర్తి యాక్షన్ మోడ్ లో చూపిస్తాడట శంకర్. ఆమె మీద సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. ఒక యోధురాలి పాత్రలో ఆమెను చూపించబోతున్నాడట శంకర్.
ఈ పాత్ర కోసం అమీ.. కేరళలో ప్రఖ్యాతి చెందిన కలర్పయ్యట్టు అనే యుద్ధ కళను సైతం నేర్చుకుంటోందట. ఈ శిక్షణ పూర్తయ్యాక అమ్మడు భారీ లెవెల్లో స్టంట్లు చేయబోతోందట. ‘2.0’ కొత్త షెడ్యూల్లో రజినీకాంత్-అమీ జాక్సన్ కాంబినేషన్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తీయబోతున్నాడు శంకర్. రజినీ చేసే ఫైట్లలో చాలా వరకు డూప్ తో లాగించేయబోతుండగా.. అమీ మాత్రం తనే స్వయంగా ఈ ఫైట్లన్నీ చేస్తుందట. ఎంతో సుకుమారంగా కనిపించే అందాల రాశి అమీని శంకర్ ఇంత కష్టపెట్టించేస్తున్నాడేంటా అని ఆమె అభిమానులు బాధపడిపోతున్నారు పాపం. త్వరలోనే మొదలయ్యే కొత్త షెడ్యూల్ మూడు నెలల పాటు నిర్విరామంగా కొనసాగుతుందని సమాచారం.