Begin typing your search above and press return to search.

యోగాతో ఇంకొంచెం అందం

By:  Tupaki Desk   |   7 Oct 2017 5:10 PM GMT
యోగాతో ఇంకొంచెం అందం
X
ప్రస్తుత రోజుల్లో యోగా చాలా వరకు ఫెమస్ అవుతోంది. యోగాని దేశ ప్రధాని మోడీ గారు మరో స్థాయికి తీసుకువెళ్లారనే చెప్పాలి. మనఃశాంతి కి యోగా ఎంతో అవసరం. అంతే కాకుండా ఎటువంటి టెన్షన్స్ ఉన్నా యోగా ద్వారా మాయమైపోతాయని ఆధ్యాత్మిక గురువులు చెబుతూనే ఉన్నారు. ఇక యోగాలో అనేక లాభాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కోరుకునే ఫిట్ నెస్ ని కూడా యోగా ద్వారా పొందవచ్చు.

చాలా మంది మోడల్స్ - సినీ తారలు ఎక్కువగా ఏరియల్ యోగాను బాగా చేస్తుంటారు. అదే తరహాలో రీసెంట్ గా అమీ జాక్సన్ కూడా మొదలు పెట్టింది. తన ఆకృతిని ఇంకా అందంగా చేసుకోవాలని ఏరియల్ యోగా అంటూ కొత్త ఆసనాలను మొదలు పెట్టింది. ఇప్పుడిపుడే అందులో ఉన్న టెక్నీక్స్ ని బాగా ఫాలో అవుతోందట. డైలీ జిమ్ వర్కౌట్స్ లాంటివే కాకుండా ఈ తరహాలో కూడా తన హెల్త్ ని ఆకృతుని డెవలప్ చేసుకుంటోంది అమీ.

ఇక అమీ రోబో సీక్వెల్ 2.0 షూటింగ్ ని కొన్ని నెలల క్రితమే పూర్తి చేసింది. ప్రస్తుతం మరి కొన్ని సినిమాల్లో నటిస్తోంది. అలాగే హాలీవుడ్ లోని ఒక వెబ్ సిరీస్ లో కూడా అమీ జాక్సన్ నటిస్తోంది.