Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: లండ‌న్ బ్యూటీ డేరింగ్ ఫీట్

By:  Tupaki Desk   |   7 Aug 2019 3:10 PM GMT
ఫోటో స్టోరీ: లండ‌న్ బ్యూటీ డేరింగ్ ఫీట్
X
లండ‌న్ బ్యూటీ ఎమీ జాక్స‌న్ బోయ్ ఫ్రెండ్ జార్జిని పెళ్లాడేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ జంట‌కు నిశ్చితార్థం అయ్యింది. అయితే పెళ్లికి ముందే ఎమీ గ‌ర్భ‌ధార‌ణ అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. జార్జితో ప్రేమ‌కు గుర్తుగా బుజ్జి పాపాయి అప్పియ‌రెన్స్ ఇవ్బ‌బోతున్నాడంటూ ఎమీ జాక్సన్ ప్ర‌స్తుతం క‌ల‌ల లోకంలో తేలిపోతోంది.

ఇప్ప‌టికే గ‌ర్భ‌ధార‌ణ‌కు సంబంధించిన ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ఎమీ అభిమానుల‌కు షేర్ చేస్తూనే ఉంది. తాజాగా ఎమీ జాక్స‌న్ ఫ్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ కొత్త ఫోటోని రివీల్ చేసింది. ``అధికారికంగా ఇప్ప‌టికి 33 వారాల గ‌ర్భం ఇది. లిటిల్ అప్పియ‌రెన్స్ కోస‌మే ఎదురు చూస్తున్నాం`` అని తెలిపింది. గ్రీస్ వెళ్లామ‌ని అనుకుంటున్నారేమో.. ఇంటి వెన‌క పెర‌డులోనే స‌మ‌యాన్ని గ‌డిపేస్తున్నామ‌ని వెల్ల‌డించింది.

ఇప్ప‌టికే ఎనిమిది నెల‌లు నిండింది. ఇక తొంద‌ర్లోనే బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఎమీ హింట్ ఇచ్చింది. అయితే ఇలా ఎనిమిది నెల‌ల గ‌ర్బానికి సంబంధించిన ఫోటోని ఇంత ఓపెన్ గా అభిమానుల‌కు షేర్ చేయ‌డం అన్న‌ది డేరింగ్ ఫీట్ అనే చెప్పాలి. ప‌బ్లిక్ ప్లాట్ ఫామ్ పై ప్ర‌తిదీ ఇలా షేర్ చేసుకోవ‌డం అన్న‌ది ధైర్యానికి సంబంధించిన విష‌యం. అభిమానులు త‌న డేర్ ని పొగిడేయ‌కుండా ఉండ‌లేరు. ఎమీ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.