Begin typing your search above and press return to search.
రజినీ కోసం అమీ ఆఖరి ఆట
By: Tupaki Desk | 18 July 2017 4:10 PM GMTకబాలి తర్వాత రజినీకాంత్ నటిస్తున్న మూవీ 2.0. రోబో సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కంటే ముందే.. కాలా కరికులన్ విడుదల కానున్నా.. శంకర్ డైరెక్షన్ కావడంతో 2.0కు ఉన్న క్రేజ్ ను అంచనా వేయడం కష్టం. ఇప్పటికే ఈ సినిమాకు టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిపోయినట్లు స్వయంగా దర్శకుడే చెప్పేశాడు. మిగిలిన ప్యాచ్ వర్క్ ను కూడా పూర్తి చేసేయగా.. ఇంకా షూటింగ్ చేయాల్సిన ఒకే ఒక్క పాటకు ఇప్పుడు షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది.
రోబో చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ లో ఇదే ఆఖరి పాట కావడం విశేషం. ఆగస్ట్ లో ఈ సాంగ్ పిక్చరైజేషన్ చేయనున్నారట. సూపర్ స్టార్ తో పాటు.. అందాల భామ అమీ జాక్సన్ కూడా ఈ పాట షూటింగ్ లో పాల్గొననుంది. మొత్తం 12 రోజుల పాటు చిత్రీకరించేలా.. షెడ్యూల్స్ ఫిక్స్ అయ్యాయట. మరి రజినీకాంత్ తో డ్యాన్స్ అంటే మాటలా.. పైగా ఎక్కువ భాగం డ్యాన్స్ అంతా హీరోయిన్ పైనే ఉంటుంది. అందుకోసమే ఈ 12 రోజుల షూటింగ్ కోసం.. 10 రోజుల పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయనుందిట అమీ జాక్సన్.
ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం ఈ పాటను స్వరపరుస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఫైనల్ సాంగ్ ను దర్శకుడికి అప్పగించనుంచగా.. బాస్కో మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించనున్నాడు. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే స్పెషల్ గా.. 2.0 థియేటర్లలోకి రానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించడం.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.