Begin typing your search above and press return to search.

అమీ ప్రేమ ఇంత ఘాటుగానా..

By:  Tupaki Desk   |   11 Jun 2018 11:56 AM GMT
అమీ ప్రేమ ఇంత ఘాటుగానా..
X

హీరోయిన్స్ కు ఎలాంటి భర్త వస్తాడా? అనే విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు బాగానే సాగుతుంటాయి. కాస్త డౌట్ వచ్చినా కూడా నిమిషాల్లో ఆ న్యూస్ వైరల్ అవ్వడం కామన్. ప్రస్తుతం బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ విషయం కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతోంది. అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ తో ఇచ్చిన స్టిల్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ ఫోటో కూడా అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. ఘాటుగా ఉన్న ఆ స్టిల్ గురించి వర్ణించడం కష్టమే. బాయ్ ఫ్రెండ్ జార్జ్ పానాయియోటో అమీ లెగ్స్ అందాలపై చేయి వేసి ఉండగా అతని కళ్లలో లవ్ సింబల్స్ కనిపించాయి. ఆ విధంగా అమీ సెట్ చేసిందని అర్ధమవుతోంది. ఆమె బాయ్ ఫ్రెండ్ పై ప్రేమ బాగానే కనిపించింది. జార్జ్ పానాయియోటో అనే ఆ వ్యక్తి యూకే లోనే అతిపెద్ద బిజినెస్ మెన్ లలో ఒకరైన సంపన్నుడు.

అమీ అతనితో ప్రస్తుతం రిలేషన్ లో ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు అని వార్తలు వస్తున్నాయి; ఇక ఈ బ్యూటీ హాలీవుడ్ లో కంటే ఇండియన్ సినిమాల్లోనే వెలిగిపోయింది. ప్రస్తుతం అక్కడ ఆఫర్స్ వస్తుండడంతో యూ టర్న్ తీసుకుంది. ఆమె రజినీకాంత్ - శంకర్ కలయిక లో తెరకెక్కిన 2.0 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.