Begin typing your search above and press return to search.

ఆవిడ ఫ్యూచర్‌ గురించి ఈవిడకెందుకో..

By:  Tupaki Desk   |   17 Aug 2015 11:28 AM IST
ఆవిడ ఫ్యూచర్‌ గురించి ఈవిడకెందుకో..
X
లండన్‌ నుంచి దిగుమతి అయ్యింది ఎమీజాక్సన్‌. మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకొచ్చింది. ఏకంగా తమిళ సినిమానే ఏల్తోందిప్పుడు. తమిళ్‌ లో తమిళమ్మాయిలకే ఛాన్సులు లేకుండా చేసేస్తోంది. అంతేనా ఇప్పుడు ఏకంగా తమిళ్‌ మాట్లాడేస్తూ శభాష్‌ అనిపించుకుంటోంది. ఓ ఇంగ్లీష్‌ అమ్మాయి, తమిళ రాష్ట్రంలోకి వచ్చి తమిళ్‌ నేర్చుకుని తంబీల్నే ఇంప్రెస్‌ చేయడం అనేది ఆసాధారణమైన ఫీట్‌. ఎమీ పట్టుదలకు ఇదంతా నిదర్శనం.

మదరాసి పట్టణం సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. అటుపై రామ్‌ చరణ్‌ సరసన ఎవడు చిత్రంలో నటించింది. ఇప్పుడు కోలీవుడ్‌ లోనే క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ధనుష్‌ సరసన 'వేలై ఇళ్ల పట్టాధారి- 2' (విఐపి 2), విజయ్‌ సరసన విజయ్‌ 59 చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈ రెండు సినిమాల్లో సమంత సహనటి. ఎమీజాక్సన్‌ పట్టుదలను దగ్గరగా చూసిన సమంత ఈ అమ్మడిని తెగ పొగిడేసింది.

విఐపి 2లో కలిసి నటిస్తున్నాం. ఎమీ తమిళ్‌ మాటలు ఎంత ముద్దొస్తున్నాయో. తనకి మంచి భవిష్యత్‌ ఉందంటూ కితాబిచ్చింది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌ లో సమంత అవకాశాల్నే తన్నుకుపోయే లెవల్‌ లో ఎమీ ఉందన్నది నిజం. అలాంటప్పుడు ఆవిడ ఫ్యూచర్‌ గురించి ఈవిడ మాట్లాడడమేంటో? అంటూ చెణుకులు వేస్తున్నారంతా.