Begin typing your search above and press return to search.

రోబోగా మారిపోతున్న బ్రిటిష్ హాటీ

By:  Tupaki Desk   |   16 Dec 2015 4:00 AM IST
రోబోగా మారిపోతున్న బ్రిటిష్ హాటీ
X
రోబో-2.. ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే సంచలనం రేపుతున్న సినిమా. షూటింగ్ మొదలవకముందే కేవలం కాంబినేషన్ క్రేజ్‌ తోనే జనాల్ని ఆకర్షించడం శంకర్‌ కు అలవాటే. ఈ సినిమాను హీరోను ఫిక్స్ చేయడానికే చాలా ఆలోచించాడు శంకర్. రోబో హీరో రజినీనే అయినప్పటికీ.. సీక్వెల్‌ ను ఇంకో హీరోతో తీద్దామని చూశాడు. తర్వాత రజినీతోనే ఫిక్సయ్యాడు. ఇందులో కీలకమైన విలన్ పాత్రకు దేశంలోని చాలా మంది టాప్ యాక్టర్స్‌ పేర్లను పరిశీలించాడు. కానీ ఎవ్వరూ ఆనకపోతే హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌ నెగ్గర్‌ పై దృష్టిపెట్టాడు. కానీ ఆర్నాల్డ్ సంగతి ఇప్పుడు డౌట్ అంటున్నారు. ఇక రోబో సినిమాలో హీరోయిన్ కూడా చాలా కీలకమైందన్న సంగతి తెలిసిందే. మరి రజినీ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నదానిపైనా ఆసక్తి నెలకొంది. ఈ పాత్రకు అమీ జాక్సన్ ఓకే అయింది.

అమీ జాక్సన్ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తాను రోబో-2లో నటించబోతున్న మాట వాస్తవమే అని కన్ఫమ్ చేసింది. ‘‘శంకర్ దర్శకత్వంలో ఒక్కసారి నటించడమే అదృష్టం. కానీ నాకు రెండో అవకాశం కూడా వచ్చింది. రోబో-2లో రజినీకాంత్ సరసన నటించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని అమీ చెప్పింది. ఇక పోతే ‘రోబో-2’లో అమీ రోబో పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. మానవుల తెలివితేటలు వచ్చిన రెండు రోబోలే ఇందులో హీరో హీరోయిన్లట. రజినీ, అమీ ఇద్దరూ రోబోలుగా కనిపిస్తారట. ఇప్పటికే అమీకి రోబో టెస్ట్ షూట్ కూడా చేశారట. ఆమె రూపానికి తగ్గట్లు ఓ స్పెషల్ రోబోను తయారు చేయించే పనిలో ఉన్నాడట శంకర్. ఈ నెలలోనే మొదలు కావాల్సిన రోబో-2 చెన్నై వరదల కారణంగా వచ్చే నెలకు వాయిదా పడింది.