Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: ఎమీజాక్సన్ బేబి బంప్
By: Tupaki Desk | 30 April 2019 12:01 PM GMTబేబి బంప్ ప్రదర్శన అనేది ప్రస్తుతం ఓ ట్రెండ్ గా మారింది. ముఖ్య ంగా అందాల కథానాయికలు తమ గర్భధారణను రహస్య ంగా దాచుకునేందుకు ఎప్పుడూ ఆసక్తిగా లేరు. బేబి బంప్ ను బాహ్య ప్రపంచానికి ఆవిష్కరించేందుకు ఏమాత్రం మొహమాటపడడం లేదు. బాలీవుడ్ అందాల కథానాయికలు నేహా ధూపియా.. కొంకణా సేన్.. లారా దత్తా.. సెలీనా జైట్లీ .. జెనీలియా.. సోహా అలీఖాన్.. కరీనా కపూర్.. రాణీ ముఖర్జీ.. రవీనా టాండన్.. మందిరా భేడీ.. ఐశ్వర్యారాయ్.. కరీనాక పూర్.. శిల్పాశెట్టి.. అమృత అరోరా.. ఇలా బాలీవుడ్ స్టార్లు అంతా బేబి బంప్ ని మీడియా ముందు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. పలువురు సౌత్ బ్యూటీస్ సైతం బేబి బంప్ ని మీడియాకు ప్రదర్శించిన సందర్భాలున్నాయి.
కొందరు అందాల నాయికలు ఏకంగా బేబి బంప్ తో ర్యాంప్ వాక్ లే చేశారు. పలు ఫ్యాషన్ ఈవెంట్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లారా దత్తా.. నేహా ధూపియా ఇదివరకూ ఈ తరహా ఫీట్స్ వేసి ఆశ్చర్యపరిచారు. ఇక అదే బాటలో లేడీ రోబోట్ ఎమీజాక్సన్ సైతం తన బేబి బంప్ ప్రదర్శనకు మీడియా ముఖంగా సిద్ధమవ్వడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. తాజాగా ఎమీ ప్రో నోవియాస్ ఫ్యాషన్ షోలో బేబి బంప్ ప్రదర్శన చేయడం పై ఆసక్తికరంగా ముచ్చటించుకుంటున్నారు.
ఈ కొత్త లుక్ ఆసక్తికరం. ఎమీ పూర్తిగా రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ బేబి బంప్ ఫోటోకి అభిమానుల నుంచి అద్భుత స్ప ందన వచ్చింది. కొందరైతే ఎమీ ఏకంగా కవలల్ని కనాలని ఆశీర్వదించారు. మరికొందరు ఈ రూపంలో హ్యాపీనా.. అనుకున్నది సాధించావా? అని ప్రశ్నించారు. వేరొక అభిమాని.. ``అసలు పెళ్లెప్పుడు చేసుకున్నావ్? నాకు ఇన్విటేషన్ అయినా ఇవ్వలేద``ని ఆశ్చర్య ం వ్యక్తం చేశాడు. రేపు మీరు బార్సిలోనాలో ఏం చేయబోతున్నారు? అంటూ వేరొక విదేశీ అభిమాని ప్రశ్నించారు. మొత్తానికి ఎమీజాక్సన్ బేబి బంప్ ప్రదర్శన తాజా లైవ్ షోలో హైలైట్ అయ్యింది. ఇక తన బ్రిటీష్ బోయ్ ఫ్రెండ్ జార్జి పనాయటౌ ని పెళ్లాడేందుకు ఎమీ సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పెళ్లి చేసుకునే వీలుందని ప్రచారం సాగుతోంది.