Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ట్రెండ్ సృష్టిస్తున్న ప్రెగ్నెంట్ బ్యూటీ
By: Tupaki Desk | 19 May 2019 2:30 PM GMTబ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ త్వరలో అమ్మకానున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన తర్వాతే తన ప్రియుడు జార్జ్ పనయిటుతో గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ జరిగింది. ఎంత పెద్ద మోడల్ అయినా.. హీరోయిన్ అయినా ఒకసారి గర్భం దాలిస్తే మీడియాకు ఒక అడుగు దూరంగా ఉంటారు. ఒకవేళ ఫోటో షూట్ చేసినా.. ఒకటి అరా సందర్భాలలో మాత్రమే అలా చేస్తారు. కానీ అమీ రూటే సెపరేటు.
రెగ్యులర్ గా ఫోటో షూట్లు చేస్తూ వాటిని తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తోంది. అదే కోవలో తాజాగా మరోసారి తన విశ్వరూపం చూపించింది. అయితే ఇది ఉత్తుత్తి గ్లామర్ ఫోటో షూట్ కాదు. ఈ బ్రిటన్ భామ 'గెస్' అనే బ్రాండ్ కు అంబాజిడర్ గా పనిచేస్తోంది. ఐరోపాలో పాపులర్ అయిన ఈ బ్రాండ్ లో పలురకాల ఐటమ్స్ ఉన్నాయి. దుస్తులు.. వాచీలు.. బ్యాంగిల్స్ తో పాటు కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి. ఆ కాస్మెటిక్స్ బ్రాండ్ ను గెస్ లాస్ ఏంజెలెస్ 1981 కేటగిరి కింద ప్రమోట్ చేస్తున్నారు. అమీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ ప్రమోషన్స్ కు అదేమీ అడ్డంకి కాలేదు. ఈ ఫోటోకు క్యాప్షన్ గా అమీ "గెస్ లాస్ ఏంజెలెస్ 1981 లాంచ్ అయ్యాయి. ఈ న్యూ కాంపెయిన్ ఎంతో ఫన్ గా ఉంది." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇక ఫోటో విషయానికి వస్తే అమీ వైట్ కలర్ గౌన్ లో ఎంతో స్టైలిష్ గా నడుస్తూ పోజ్ ఇచ్చింది. కళ్ళకు స్టైలిష్ గాగుల్స్.. భుజానికి స్లీక్ గా ఉండే బ్యాగ్ ధరించి సూపర్బ్ లుక్ లో కనిపించింది. ఒక అమీకి వెనక ఒక కార్ పై గెస్ బ్రాండ్ వారి యాడ్ ఉంది. అందులో కూడా అమీ జాక్సన్ ఫోటో ఉంది. యాడ్ లో ఉన్న ఆ ఫోటో ప్రెగ్నెంట్ కాక మునుపు ఫోటో కావడంతో చాలా స్లిమ్ గా ఉంది.
ప్రెగ్నెంట్ అయితే మోడలింగ్ కు దూరంగా ఉండాలనే పాత ఆలోచనలకు అమీ ఫుల్ స్టాప్ పెడుతూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది కదా. ఈ ఫోటోకు నెటిజనులు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. ఒకరు "అమీలో చాలా గ్రేస్ ఉంది" అన్నారు. ఒకరేమో "అమీ..నువ్వు ప్రెగ్నెంట్ కదా.. ప్లీజ్ హీల్స్ ధరించకు. టేక్ కేర్ అఫ్ యువర్ హెల్త్" అన్నారు. ఇంకొకరు "పెంగ్విన్ లా క్యూట్ గా ఉన్నావు" అన్నారు.