Begin typing your search above and press return to search.

బిడ్డ‌ను క‌న‌బోతూ ఈ సాహ‌సాలేంటి?

By:  Tupaki Desk   |   23 Jun 2019 4:35 PM GMT
బిడ్డ‌ను క‌న‌బోతూ ఈ సాహ‌సాలేంటి?
X
2.0 లో న‌టించాక వేరొక సినిమాకి సంత‌కం చేయ‌కుండా పూర్తిగా వ్య‌క్తిగ‌త జీవితానికే ప్రాధాన్య‌త‌నిచ్చింది ఎమీజాక్స‌న్. ప్రియుడు జార్జి ప‌నాయ‌టౌతో స‌హ‌జీవ‌నం అనంత‌రం ఫ్రెగ్నెన్సీ గురించి తెలిసిందే. త్వ‌ర‌లోనే ప్రియుడిని పెళ్లాడేందుకు సిద్ధ‌మవుతోంది. ఇదివ‌ర‌కూ ఈ బ్యూటీ నిశ్చితార్థం పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఎమీజాక్స‌న్ ఫ్రెగ్నెన్సీ స్టిల్స్ అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

ఎమీ స్వ‌యంగా ఈ స్టిల్స్ ని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేస్తోంది. ఇందులో జిమ్ చేస్తూ ఉన్న ఫోటోలు అంతే జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఎమీ జాక్స‌న్ ఎంతో కేరింగ్ తీసుకుని లైట్ వెయిట్ ఎక్స‌ర్ సైజులు చేస్తోంద‌ని ఫోటోల‌లో రివీలైంది. మ‌రోవైపు ఎమీజాక్స‌న్ బిడ్డ‌కు జన్మ‌నిచ్చేందుకు ఇంకెంతో స‌మ‌యం లేదు. ఈ కండీష‌న్ లోనూ ఎమీ పెళ్లిళ్ల‌కు షికార్లు చేయ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ప్ర‌స్తుతం ఎమీజాక్స‌న్ భ‌ర్త‌ జార్జి ప‌నాయ‌టౌ సోద‌రి పెళ్లి వేడుక‌ల కోసం రోడ్ ట్రిప్ వెళ్లింది. రోడ్ మార్గంలో యూర‌ప్ న‌గ‌రాల్లో ప్ర‌యాణించింద‌ట‌. అది కూడా తోడ పెళ్లి కూతురిగా పెళ్లి కూతురికి సాయానికి వెళ్లింద‌న్న‌ది హాట్ టాపిక్. అయితే ఫ్రెగ్నెన్సీ స‌మ‌యంలో బ‌రువులు ఎత్త‌కూడ‌ద‌ని.. ప్ర‌యాణాలు చేయ‌కూడ‌ద‌న్న కండీష‌న్స్ ఏవీ పెట్టుకోకుండా ఎమీ ఇలా స్వేచ్ఛ‌గా తిరిగేయ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. యోగా.. మెడిటేష‌న్ .. జిమ్ ఏదీ ఎమీ విడిచిపెట్ట‌దు. ఇక పెళ్లిల్లు .. పండ‌గ‌లు.. ప‌బ్బాలు వేటిని విడిచిపెట్ట‌డం లేదు. లేటెస్టుగా జిమ్ చేస్తున్నప్ప‌టి ఓ ఫోటోని ఎమీ షేర్ చేసింది. ఈ ఫోటోలో ఎమీ కాబోయే స్ట‌న్నింగ్ మ‌మ్మీని త‌ల‌పిస్తోందంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ప్ర‌తిరోజూ జిమ్ కి వెళ్లే ముందు ఒక క‌ప్పు తేనె తాగుతున్నా. 26 వారాల ఫ్రెగ్నెన్సీ స‌మ‌యం పూర్త‌యింద‌ని ఎమీ వెల్ల‌డించింది. ఎమీ ఇచ్చిన వివ‌రాల్ని బ‌ట్టి ఇంకో 3-4 నెల‌ల్లో బిడ్డ‌ను క‌న‌బోతూ ఇలాంటి సాహ‌సాలు చేయ‌డం త‌న‌కే చెల్లింద‌న్న‌మాట‌.