Begin typing your search above and press return to search.

అమీ.. అంత రిస్కెందుకమ్మీ!!

By:  Tupaki Desk   |   19 March 2017 6:01 AM GMT
అమీ.. అంత రిస్కెందుకమ్మీ!!
X
సినిమాల కోసం.. షూటింగ్ ల కోసం లండన్ బ్యూటీ అమీ జాక్సన్ ఎలాంటి రిస్క్ అయినా చేసేస్తుంటుంది. రిస్కీ షాట్స్ విషయంలో కూడా ఎలాంటి బాడీ డబుల్స్ ఉపయోగించకుండా.. తనే చేసేస్తుంటుంది. ఇప్పుడు అలాంటి ఓ ప్రయోగమే చేసి గాయాల పాలయ్యిందట అమీ.

రీసెంట్ గా రోబో సీక్వెల్ 2.0 షూటింగ్ లో పాల్గొన్న అమీ.. ప్రస్తుతం లండన్ లో ఉంది. అక్కడకు ఓ యాడ్ షూటింగ్ కోసం వెళ్లగా.. ఈ కమర్షియల్ కోసం పరిగెట్టాల్సి ఉంటుందట. అలా పరిగెడుతూ ఉండగా.. హఠాత్తుగా జారి పడిపోయిందట అమీ జాక్సన్. దగ్గర్లోనే ఉన్న హాస్పిటల్ లో ఫస్ట్ ఎయిడ్ చేసి.. ఓ వారం పాటు రెస్ట్ తీసుకోమంటే.. ఈమె ఆ విషయాన్ని పట్టించుకోకుండా మళ్లీ వచ్చి షూటింగ్ చేసేసిందట. దీంతో కాలి నొప్పి ఇంకా ఎక్కువైపోవడంతో.. చివరకు తప్పక యూనిట్ కి ఆ విషయం చెప్పిందట అమీ. మళ్లీ హాస్పిటల్.. రెస్ట్.. షరా మమూలే.

అమీకి గాయాలు అయ్యాయని తెలియగానే.. 2.0 యూనిట్ గుండెల్లో రాయి పడింది. ఈ మూవీలో అమీ పాత్ర షూటింగ్ పూర్తయిపోయినా.. ఇంకా కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలిఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుందని వాళ్ల ఆందోళన. అయితే.. కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తెలియడంతో.. ఊపిరి పీల్చుకున్నారట 2.0 యూనిట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/