Begin typing your search above and press return to search.

అమీ ఆరోగ్యం అలా కాపాడుకుంటుందట

By:  Tupaki Desk   |   8 Nov 2017 9:27 AM GMT
అమీ ఆరోగ్యం అలా కాపాడుకుంటుందట
X
బ్రిటన్ భామ అయినా.. అమీ జాక్సన్ ఇండియాలో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో తెగ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. అటు నార్త్ ను ఇటు సౌత్ ను కూడా బాగానే కవర్ చేసేస్తూ.. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో భాగం అవుతోంది. ఇప్పుడు అమీ జాక్సన్ సేంద్రీయ వ్యవసాయం కూడా చేసేస్తుందట.

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ దారిలో ఉండగా.. ఇప్పుడీ జాబితాలో అమీ కూడా స్థానం సంపాదించేస్తోంది. లండన్ పరిసరాల్లో ఓ భారీ ప్లాట్ ను కొనుగోలు చేసి.. అక్కడ తనే కూరగాయలు.. పండ్లు పండిచేస్తుందట అమీ. అది కూడా ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా.. సేంద్రీయ వ్యవసాయం ద్వారానే వీటిని పండిస్తుందట అమీ జాక్సన్. ఆర్గానిక్ ఫుడ్ పై తనకు అసలు అవగాహన కలిగించిన వ్యక్తి.. తన అమ్మే అని చెబుతోంది అమీ జాక్సన్. 'మా అమ్మ ఆర్గానిక్ ఉత్పత్తులే తినాలని గట్టి నిర్ణయం తీసుకుంది. నేను ఇలా చేయగలనని ఎన్నడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు నేను ఇప్పుడు మంచి ఆహారం తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నాను'అని చెబుతోంది అమీ జాక్సన్.

ఈ బ్రిటన్ భామ నటించిన 2.0 మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 13న తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.