Begin typing your search above and press return to search.
సల్మాన్ తో ఎఫైర్ కావాలంటున్న హాటీ
By: Tupaki Desk | 30 Nov 2016 9:30 AM GMTబాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ కెరీర్లో ఎన్నెన్ని ఎఫైర్లో. సంగీతా బిజిలానీ.. ఐశ్వర్యారాయ్.. కత్రినా కైఫ్.. జరీన్ ఖాన్.. ఇలా చాలామందితో యవ్వారాలు నడిపాడు కండల వీరుడు. చివరగా రుమేనియా భామ లులియా వాంటూర్ తో ప్రేమాయణం ఒక కొలిక్కి వచ్చి.. ఇద్దరూ పెళ్లికి కూడా రెడీ అయిపోయినట్లు వార్తలు వచ్చాక కూడా సల్మాన్ కొత్త ఎఫైర్ల గురించి ఊహాగానాలు ఆగడం లేదు. లులియాతో ప్రేమాయణం సాగిస్తూనే.. బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ తోనూ కొత్తగా వ్యవహారం మొదలుపెట్టాడంటూ ఈ మధ్య బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై అమీ జాక్సన్ ను మీడియా వాళ్లు ప్రశ్నిస్తే.. దిమ్మదిరిగిపోయే సమాధానం ఇచ్చిందామె.
‘‘సల్మాన్ తో డేటింగ్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు’’.. ‘‘సల్మాన్ అవకాశమిస్తే.. అతడితో ఎఫైర్ పెట్టుకోవడానికి నేను రెడీ.. కానీ నాకు ఆ అదృష్టం లేదు’’.. ఇవీ అమీ జాక్సన్ చేసిన వ్యాఖ్యలు. మామూలుగా ఎఫైర్ వ్యాఖ్యల్ని ఖండిస్తే జనాలు లైట్ తీసుకుంటున్నారని.. ఇలా వెరైటీ స్టేట్మెంట్లు ఇచ్చినట్లుంది అమీ. సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఫ్రీకీ అలీ’ సినిమాలో అమీ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి సల్మాన్ మరో తమ్ముడు సోహైల్ ఖాన్ దర్శకుడు. ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్న టైంలో సల్మాన్.. అమీతో వ్యవహారం మొదలుపెట్టాడన్నది బాలీవుడ్లో ఒక టాక్. మరి అమీ ఏమో సింపుల్ గా ఎఫైర్ వార్తల్ని కొట్టి పారేసింది. మరి సల్మాన్ ఏమంటాడో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/