Begin typing your search above and press return to search.
అమీకి చిరకట్టు ఎందుకో..
By: Tupaki Desk | 24 Nov 2017 8:02 AM GMTసాధారణంగా బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్ తెరపై నటించడానికి చాలా ఆలోచిస్తారు. కానీ కొంత మంది బాలీవుడ్ హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో అన్ని భాషల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇక అసలు విషయానికి ప్రస్తుతం ఇండియాలో ఉన్న అన్ని భాషల్లోను సినిమాలను చేయడానికి మొగ్గుచూపుతోన్న ముద్దుగుమ్మ అమీ జాక్సన్. ఈ బ్రిటన్ భామ ప్రస్తుతం కోలీవుడ్ లొనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ ను తెచ్చుకొంది.
సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా తనదైన శైలిలో సినిమాలను చేస్తూ అలరిస్తోంది. అమ్మడు తెలుగులో రామ్ చరణ్ - ఎవడు సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను దక్కించుకుంది. 2.0 లాంటి భారీ సినిమాలో కూడా అవకాశం అందుకోంది. ఇక గ్లామర్ షోను సినిమా సినిమాకి అమీ చాలా పెంచేసింది. బికినీ అందాలతో అందరికంటే ఎక్కువ స్థాయిలో క్రేజ్ ను అందుకుంది. ముఖ్యంగా ఐ సినిమాలో తన సొగసులను ఏ స్థాయిలో చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా అమీ గ్లామర్ అందాలని తెరపై చూపించింది. అయితే రీసెంట్ గా ఈ ఇంగ్లీష్ భామ ఎవరు ఊహించని లుక్ లో కనిపించి షాక్ ఇచ్చింది.
కన్నడలో అమీ ప్రస్తుతం దేవరు ప్రితియ ఒలాగే అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో సుదీప్ హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్ గా చిత్ర యూనిట్ ఒక పాటను చిత్రీకరించింది. అయితే పాటలో అమీ చీర కట్టులో చాలా సాంప్రదాయంగా భారతీయ యువతి గా కనిపించి అందరిని ఆకర్షించింది. అసలు అమీ ఇంతలా ఎలా మారిపోయింది అని కొందరు నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ కేవలం అమీ పాట కోసమే అలా రెడీ అయ్యిందా లేక సినిమా మొత్తంలో అలానే కనిపిస్తుందా అనే విషయం తెలియాలంటే ఆ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.