Begin typing your search above and press return to search.
ఏజ్ గ్రూప్ సెట్ అయినందుకే హ్యాపీ
By: Tupaki Desk | 16 July 2016 5:53 AM GMTముంబై భామ అమైరా దస్తూర్ తెలుగు సినిమా అరంగేట్రం ఖాయమైంది. గతేడాదే ఈ చిన్నది టాలీవుడ్ తెరపై మెరవాల్సి ఉన్నా.. ఓ భారీ ఆఫర్ రావడంతో తప్పుకుంది. పూరీ జగన్నాథ్ తీస్తున్న ఓ సినిమా కోసమే కాకుండా.. మంచు విష్ణు సరసన కూడా ఓ మూవీని వదులుకుంది అమైరా. ఆ ప్రాజెక్టులు చేయాల్సిన సమయంలో జాకీచాన్ మూవీ 'కుంగ్ ఫూ యోగా'లో ఛాన్స్ రావడంతో.. పూరీ - మంచు విష్ణుల సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం తన వయసుకు మ్యాచ్ అయ్యే హీరోతో మొదటి సారి చేసే ఛాన్స్ వచ్చిందని సంబరపడిపోతోంది.
'రాజ్ తరుణ్ నా కంటే వయసులో ఒక సంవత్సరం మాత్రమే పెద్ద. మొదటిసారిగా నా వయసుకు తగిన హీరోతో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ నిర్మాణ సంస్థతో గతేడాదే ఓ సినిమా చేయాల్సి ఉంది. జాకీ చాన్ సినిమా కోసం ఇది వదులుకున్నా. దీంతోపాటే పూరీ జగన్నాథ్ సినిమా కూడా. అయితే తప్పకుండా ఆయా నిర్మాణ సంస్థలకు మళ్లీ చేస్తానని చెప్పాను. ఇప్పుడు రాజ్ తరుణ్ సినిమా కోసం వాళ్లే అడిగారు. అలా నా ఏజ్ హీరోతో నటించే ఛాన్స్ మొదటిసారి వచ్చింది' అంటోంది అమైరా దస్తూర్.
అసలీ సినిమా ఒప్పుకోవడానికి కారణం స్క్రిప్ట్ అంటున్న అమైరా.. తెలుగు సినిమాలు బాలీవుడ్ కి సరిసమానంగా ఉంటాయని.. ఒకోసారి వాటిని మించి కూడా తీస్తుంటారని చెబుతోంది. రామ్ గోపాల్ వర్మకి.. అమల అక్కినేని తాను పెద్ద ఫ్యాన్ అని చెబుతోంది అమైరా దస్తూర్.