Begin typing your search above and press return to search.

ఎద పరువాలతో మతుల్ మాయం చేస్తోందిగా..!!

By:  Tupaki Desk   |   16 Jan 2021 12:50 PM GMT
ఎద పరువాలతో మతుల్ మాయం చేస్తోందిగా..!!
X
ముంబై వయ్యారి అమైరా ద‌స్తూర్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం తక్కువే. ఎందుకంటే అమైరా తెలుగులో చేసింది ఒకే ఒక సినిమా. సందీప్ కిషన్ సరసన 'మ‌న‌సుకు న‌చ్చింది' సినిమాతో తెలుగు తెరపై అడుగు పెట్టింది అమైరా. తెలుగులో అదే అమ్మడికి ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా. అయితే ముంబైలో పుట్టిపెరిగిన ఈ అమ్మడు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలే ఎక్కువగా చేసింది. అందం, అభినయం ఉన్నా కానీ అమైరా ఎందుకో తెలుగులో సక్సెస్ కాలేకపోయింది. అందుకే అమ్మడికి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. పదహారేళ్ల వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టి డవ్, వోడాఫోన్, మైక్రోమాక్స్ వంటి బ్రాండులకు మోడలింగ్ చేసింది. ఇషాక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమైరా.. ధనుష్ సరసన అనేగన్ సినిమాతో కోలీవుడ్ లో అరంగేట్రం చేసింది. కానీ అమ్మడికి ఏ ఇండస్ట్రీలో కూడా కలిసిరాలేదని చెప్పాలి.

కనీసం అందాల ఆర‌బోత‌ అయినా చేద్దామని ఫిక్స్ అయిందట. సినిమాలలో కాదు గాని సోషల్ మీడియాలో మాత్రం అందాల విందు బాగానే చేస్తుంది. అనేకుడు సినిమాలో అమ్మడిని చూస్తే ఎంతటివారైనా ఫిదా అయిపోతారు. బాలీవుడ్ లో ఇమ్రాన్ హష్మీ సరసన "మిస్టర్ ఎక్స్" అనే సినిమా చేసింది. ఆ సినిమాలో రొమాన్స్ తో పాటు ఏకంగా బికిని కూడా ధరించి హీటెక్కించింది. ప్రస్తుతం ఎలాంటి అవకాశం ఇచ్చినా చేయడానికి రెడీగా ఉందట. వెబ్ సిరీస్ లతో పాటు చిన్న సినిమాలు చేసుకుంటుంది అమైరా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో హల్చల్ చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన ఎల్లో మిక్సడ్ గోల్డ్ మినీ ఫ్రాక్ డ్రెస్ లో అమ్మడి అందాలు చూస్తే ఎంతటి మగవారైనా చూపు తిప్పుకోరంతే. మెరిసే మేనిఛాయలో అమైరా ఎద సోయగాలను కొసరుతుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.