Begin typing your search above and press return to search.
ఇరట్ట లాంటి అటెంప్ట్ తెలుగులో కష్టమే..!
By: Tupaki Desk | 7 March 2023 8:00 AM GMTకమర్షియల్ గా మిగతా భాషల్లో ఎన్ని అద్భుతమైన సినిమాలు వచ్చినా మలయాళ పరిశ్రమ నుంచి మాత్రం కొత్త కథలు వస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా క్రైం థ్రిల్లర్ జోనర్ లో అక్కడ దర్శకులు ఆలోచించినట్టు మరెవరు థింక్ చేయలేరు. దృశ్యం, దృశ్యం 2 ఇలా ఆడియన్స్ ని కట్టి పడేసే థ్రిల్లింగ్ సినిమాలు అక్కడ నుంచి వచ్చాయి.
ఇక ఈ క్రమంలోనే మలయాళం నుంచి లేటెస్ట్ గా వచ్చిన మరో సినిమా ఇరట్ట. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సినిమా చూసిన అందరు బాబోయ్ ఇదే సినిమా.. ఇదేం ట్విస్టులు అనేస్తున్నారు.
రోహిత్ ఎం.జి కృష్ణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జోజు జార్జ్ డ్యుయల్ రోల్ లో నటించారు. అంజలి ఫిమేల్ లీడ్ గా చేశారు. మర్డర్ మిస్టరీతో మొదలయ్యే ఈ సినిమా ఇన్వెస్టిగేషన్, థ్రిల్లింగ్ అంశాలతో పాటుగా చివర్లో వచ్చే ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.
ఈ సినిమా చూసిన వారంతా క్లైమాక్స్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇలాంటి కథకు తెలుగులో రావడం కష్టమే అని చెప్పొచ్చు. ఆల్రెడీ శేఖర్ కమ్ముల తీసిన లవ్ స్టోరీ క్లైమాక్స్ లో రాజీవ్ కనకాల పాత్రని అలా చూపించి డేర్ స్టెప్ వేశాడు.
ఇక ఇరట్టు క్లైమాక్స్ అంతకుమించి ఉంటుంది. సో క్లైమాక్స్ ఏంటన్నది ఇప్పటికే కొంత అర్ధమై ఉండొచ్చు. అలాంటి సినిమాలు తెలుగులోకి తెచ్చే సాహసం చేయలేరు. ఇరట్టు నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సినిమా. మూవీ చూసిన వారంతా జోజు జార్జ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. సినిమాతో తప్పకుండా అతనికి అవార్డు వస్తుందని అంటున్నారు.
అయితే ఇలాంటి కథలను సినిమాగా తీయాలంటే అది కేవలం మలయాళ పరిశ్రమకే చెందుతుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. సినిమా కథ రాసుకోవడమే కాదు దాన్ని ఆడియన్స్ ని ఎంగేజ్ అయ్యేలా చేయడంలో కూడా వీరు సక్సెస్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇరట్ట గురించే మాట్లాడుతున్నారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉన్నా తెలుగు వర్షన్ మాత్రం అందుబాటులో లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.