Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లాగ ఒక‌ట‌వుతున్న ఇండ‌స్ట్రీ

By:  Tupaki Desk   |   7 Dec 2021 5:30 PM GMT
బాలీవుడ్ లాగ ఒక‌ట‌వుతున్న ఇండ‌స్ట్రీ
X
వ్య‌క్తి గ‌తంగా ఎన్ని మ‌న‌స్ప‌ర్థ‌లున్నా ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిందంటే అంతా ఒక్క‌తాటి పైకి రావ‌డం బాలీవుడ్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆన‌వాయితీగా మారింది. డ్ర‌గ్స్ స‌మ‌స్య త‌లెత్తినా.. మ‌రే స‌మ‌స్య వ‌చ్చినా బాలీవుడ్ వ‌ర్గాలు ఒకే తాటిపైకి వ‌చ్చి స‌మిష్టిగా ప్ర‌తిఘ‌టించి తామంతా ఒక్క‌టే అనే సంకేతాన్ని అందించారు. ఇప్పుడు ఇదే స్లోగ‌న్‌ని మ‌న టాలీవుడ్ వ‌ర్గాలు కూడా పాటిస్తున్నాయి. గ‌తంలో వ‌ర్గాలుగా.. గ్రూపులుగా వ్య‌వ‌హ‌రించిన మ‌న వాళ్ల‌లో గ‌త కొంత కాలంగా స‌మిష్టి రాగం వినిపిస్తోంది.

కోవిడ్ కార‌ణంగా ఇండ‌స్ట్రీ చాలా క్రైసిస్ లోకి వెళ్లిపోయింది. థియేట‌ర్లు తెర‌వ‌క‌.. షూటింగ్ లు స్టార్ట‌వ్వ‌క కార్మికుల‌తో పాటు ప్ర‌ధాన వ‌ర్గాల‌న్నీ స‌ఫ‌ర‌వుతుంటే మ‌న మంతా ఒక్క‌టే అంటూ ముందుకొచ్చి తమ వంతు స‌హాయంగా బూరి విరాళాలు ప్ర‌క‌టించి ఇండ‌స్ట్రీ మ‌నుగ‌డ‌కు పాటు ప‌డ్డారు. ఇటీవ‌ల జ‌రిగిన `మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో రెండు వ‌ర్గాలుగా విడిపోయి కొంత గంద‌రగోళ ప‌రిస్థితులు ఏర్ప‌డినా ఎల‌క్ష‌న్ ముగిసాక అంతా ఒక్క‌టే అని చాటుకున్నారు.

కోవిడ్ థ‌ర్ద్ వేవ్‌... ఒమిక్రాన్ ప్ర‌కంప‌ణ‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో నెల‌కొన్న భ‌యాందోళ‌న‌ల‌ని, అనుమానాల్ని ప‌టాపంచ‌లు చేస్తూ నంద‌మూరి న‌ట‌సింహం న‌టించిన `అఖండ‌` అఖండ విజ‌యాన్ని సాధిస్తూ క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురిపిస్తున్న వేళ మునుపెన్న‌డూ లేనంత‌గా అంతా ఈ సినిమాని త‌మ‌కు అందివ‌చ్చిన ప్లాట్ ఫామ్ ల‌లో ప్ర‌మోట్ చేస్తుండ‌టం విశేషం. అంతే కాకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి స్టార్ హీరో అల్లు అర్జున్ తో పాటు మెగా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి రావ‌డం .. ఈ సినిమా స‌క్సెస్‌ని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు సెల‌బ్రేట్ చేయ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

అంతే కాకుండా ఏపీ ప్ర‌భుత్వం టిక్కెట్ రేట్ల‌ని పెంచ‌డానికి వీళ్లేద‌ని జీవో రిలీజ్ చేయ‌డంతో ఇండ‌స్ట్రీ చాలా వ‌ర‌కు ఎఫెక్ట్ అయింది. అంతే కాకుండా ఏపీ ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో చాలా వ‌ర‌కు పెద్ద చిత్రాల డీల్స్ మ‌ళ్లీ రివైజ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. `పుష్ప‌` చిత్రాన్ని ముందు అనుకున్న ప్ర‌కారం భారీ రేట్ల‌కు అమ్మిన మైత్రీమూవీ మేక‌ర్స్ తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో మ‌ళ్లీ త‌మ రేట్ల‌ని రివైజ్ చేసుకున్నార‌ని, దీని వ‌ల్ల దాదాపుగా 13 కోట్లు త‌గ్గించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని తెలిసింది.

అలాగే `ఆర్ ఆర్ ఆర్ ` బిజినెస్ ప‌రిస్థితి కూడా ఇలాగే వుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్ని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే ఇండ‌స్ట్రీ అంతా ఒక్క తాటిపైకి రావాల‌ని ఇండ‌స్ట్రీ మ‌నుగ‌డ‌కే స‌మ‌స్య వాటిల్లితే తా మంతా ఒక్క‌టే అనే సంకేతాన్ని అందించాల‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. మ‌న వాళ్ల‌లో వ‌చ్చిన మార్పుని చూసి ఫ్యాన్స్‌తో పాటు స‌గ‌టు ప్రేక్ష‌కుడు కూడా ముచ్చ‌ప‌డుతున్నాడు.