Begin typing your search above and press return to search.
యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నెట్టింట ఆసక్తికర చర్చ!
By: Tupaki Desk | 3 Nov 2022 6:30 AM GMTకన్నడ స్టార్ యష్ నటించిన `కేజీఎఫ్` సిరీస్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో `కేజీఎఫ్ 2` ఊహకందని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించి పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేశారు. కేజీఎఫ్ చాప్టర్ 1` సాధించిన వసూళ్లని దృష్టిలో పెట్టుకుని `కేజీఎఫ్ 2`పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంచనాలకు మించి రికార్డు స్థాయి విజయాన్ని సాధించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏ కన్నడ సినిమా ఇప్పటి వరకు సాధించన వసూళ్లని రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలిసి ఫుల్ రన్ లో ఈ మూవీ రూ. 1250 కోట్ల మేర వసూళ్లని రాబట్టి ఆశ్చర్య పరిచింది. ఈ మూవీతో హీరో యష్ ఇండియాలో వున్న క్రేజీ స్టార్ లలో ఒకడిగా నిలిచిపోయాడు.
రెండే రెండు సినిమాలతో యావత్ దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. సినిమా రిలీజ్ తరువాత నుంచి ఫ్యామిలీకే అధిక టైమ్ ని కేటాయిస్తున్న యష్ ప్రత్యేక వెకేషన్ లకి వెళుతూ అక్కడ ఫ్యాన్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇటీవల నెట్టింట వైరల్ అవుతూనే వున్నాయి. ఇదిలా వుంటే యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. యష్ త్వరలో శంకర్ డైరెక్షన్ లో 800 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేస్తాడంటూ ప్రచారం మొదలైంది.
అంతే కాకుండా `ముఫ్తీ` డైరెక్టర్ నార్తన్ తో సినిమా చేస్తాడని కొంత మంది ప్రచారం చేస్తే...లేదు లేదు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో రూపొందనున్న ఓపీ మెహ్రా ఫిల్మ్ `కర్ణ`లోని టైటిల్ పాత్రలో యష్ నటిస్తాడని మరి కొంత మంది.. లేదు లేదుహోంబలే ఫిల్మ్స్ తో నే సినిమా చేస్తాడని మరి కొందరు, కరణ్ జోహార్ తో 1000 కోట్ల బడ్జెట్ సినిమా అంటూ మరో వార్త..
లేదు `కేజీఎఫ్ 3` కోసమే ఎదురు చూస్తున్నాడని .. ఇలా రోజుకో సిల్లీ న్యూస్ బయటికొచ్చేస్తూ నెట్టింట చర్చకు దారితీస్తోంది. మరి యష్ మైండ్ లో ఏముంది?.. `కేజీఎఫ్` గెటప్ లోనే ఇంత వరకు ఎందుకు వుంటున్నాడు..`సలార్` తరువాత `కేజీఎఫ్ 3` మొదలు పెట్టబోతున్నారా? అనే ప్రశ్నలు సర్వత్రా తలెత్తుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.