Begin typing your search above and press return to search.

అన‌బెల్లే రేంజులో భ‌య‌పెట్టే ప్ర‌య‌త్న‌మా?

By:  Tupaki Desk   |   26 Aug 2021 3:30 PM GMT
అన‌బెల్లే రేంజులో భ‌య‌పెట్టే ప్ర‌య‌త్న‌మా?
X
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ సినిమా చేస్తున్నారు అంటే మార్కెట్ వ‌ర్గాల్లో ఉండే క్రేజు వేరు. కెరీర్ ఆద్యంతం అర్థం ప‌ర‌మార్థం ఉన్న క‌థ‌ల్ని పాత్ర‌ల్ని ఎంచుకుని క‌మ‌ల్ హాస‌న్ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు. సేతుప‌తి ఇటీవ‌ల తెలుగులో విల‌న్ పాత్ర‌ల్లోనూ క‌నిపిస్తున్నారు.

అత‌డు న‌టించిన తాజా చిత్రం `అనబెల్ అండ్ సేతుపతి` ప్ర‌యోగాత్మ‌కంగా క‌నిపిస్తోంది. ఇందులో తాప్సీ ప‌న్ను క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్ పై సుధాన్ సుందరం- జి జయరాం నిర్మిస్తున్నారు. దీపక్ సుందరరాజన్ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు. సెప్టెంబర్ 17 హాట్ స్టార్ డిస్నీలో నేరుగా విడుదల కానుందని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

అనబెల్ & సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సేతుపతి- తాప్సీ జంట‌ను హైలెట్ చేశారు. అలాగే ఆ వెనక బంగ్లా క‌థేమిటో కాస్త క్యూరియాసిటీ ని పెంచుతోంది. పోస్టర్ ని ఆన్ రివర్స్ లో చూస్తే మిగిలిన నటీనటులను పరిచయం చేశారు. పోస్టర్ లో హారర్ థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఓటీటీలో విడుదలయ్యే సినిమాలలో ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. అన‌బెల్లె ప్ర‌ఖ్యాత హాలీవుడ్ హార‌ర్ ఫ్రాంఛైజీ. 2014లో అలాగే 2019లోనూ ఈ సిరీస్ నుంచి హార‌ర్ చిత్రాలు వ‌చ్చి ధ‌డ పుట్టించాయి. కిటికీలు త‌లుపులు బిగించుకుని ఒంట‌రిగా ఈ సినిమాల్ని చూడాలంటే ఒణ‌కాల్సిందే. హాలీవుడ్ లో మిర్ర‌ర్స్ త‌ర్వాత మ‌ళ్లీ అలా ద‌ఢ పుట్టించిన సిరీస్ గా పాపుల‌రైంది. ఇప్పుడు అన‌బెల్లె ఏకంగా సేతుప‌తి- తాప్సీ సినిమా టైటిల్లోనే ఉంది. మ‌రి ఆ రేంజులో భ‌య‌పెడుతుందా? అన్న‌ది వేచి చూడాలి.