Begin typing your search above and press return to search.
పెళ్లి కోసం పబ్లిసిటీ పాట్లు
By: Tupaki Desk | 6 Aug 2018 11:18 AM GMTమరో మూడు రోజుల్లో విడుదల కానున్న శ్రీనివాస కళ్యాణం ప్రమోషన్ వీలైనంత వినూత్నంగా చేసే ప్రయత్నంలో దిల్ రాజు టీమ్ చాలా పాట్లే పడుతోంది. పెళ్లి నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ తో పాటు ఆడియో కూడా బాగానే ఉందనే రిపోర్ట్స్ తెచ్చుకోవడంతో అదే మాట రిజల్ట్ విషయంలో కూడా రావాలని బాగా ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఓ కొత్త స్కీం ప్రకటించారు. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఎవరైతే ఈ సీజన్ లో పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళ శుభలేఖ కనక టీమ్ కు ఈ మెయిల్ చేస్తే అందులో నుంచి కొన్ని జంటలను ఎంపిక చేసి సినిమా నటీనటులతో మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ పట్టు వస్త్రాలు బహూకరిస్తారట. ఒకవేళ ఎంపిక కాకపోతే ఎలా అనే దిగులు వలదు. మిగిలిన వారికి అడ్రెస్స్ కు కొరియర్ రూపంలో పట్టు వస్త్రాలు నేరుగా ఇంటికి వచ్చేస్తాయి. ఇదేదో బాగుంది. లక్కీగా తగిలితే నితిన్ రాశిఖన్నాలతో పాటు యూనిట్ అందరి మధ్య కూర్చుని బట్టలు తీసుకోవచ్చు. కాకపోయినా పైసా ఖర్చు లేకుండా నేరుగా ఇంటికే వస్తాయి.
అయితే ఎన్ని జంటలకు ఈ అవకాశం అనేది మాత్రం బయటికి చెప్పలేదు. ఇప్పటికే వందల్లో కిట్స్ రెడీ చేసి ఉంచారు. వీటికి స్పాన్సర్ గా కెఎల్ ఎం షాపింగ్ మాల్ వ్యవహరిస్తోంది. ప్రతి బాక్సు మీద శ్రీనివాస కళ్యాణం లోగోతో పాటు ఈ సంస్థ ఎంబ్లెమ్ ను హై లైట్ చేసారు. సో ఉభయ తారకంగా అటు బట్టల సంస్థ అడ్వర్టైజింగ్ తో పాటు సినిమా ప్రమోషన్ ను ఏకకాలంలో చేసే ఈ ప్లాన్ ఏదైతే ఉందొ నిజంగా మెచ్చుకోదగ్గదే. వీటితో పాటు మరో రెండు న్యూస్ ఛానెల్స్ ఓ ఈవెంట్ మానేజ్మెంట్ సంస్థలు కూడా ఈ గిఫ్ట్ పార్టనర్స్ గా ఉన్నాయి. ఆడియో రిలీజ్ లో కూడా అచ్చం ఇదే తరహాలో వచ్చిన అతిధులకు మీడియా ప్రతినిధులకు మిక్స్ డ్ స్వీట్స్ బాక్స్ ఇచ్చి మార్కెటింగ్ చేసిన దిల్ రాజు ఇప్పుడు ఈ ఎత్తుగడ అందుకున్నారు. అయినా ఇలా బట్టలు పెట్టడం స్వీట్లు పంచడం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ సినిమాలో కంటెంట్ ఉంటే ఇవన్నీ అవసరం లేదని గతంలో ఆయన సినిమాలే ఋజువు చేశాయి. మరి ఇప్పుడు విడుదల మరో మూడు రోజుల్లో ఉందనగా ఈ స్కీముల పరమార్థం ఏమిటో. నితిన్ రాశి ఖన్నా జంటగా నటించిన ఈ మూవీకి దర్శకుడిగా సతీష్ వేగ్నేశ బ్రాండ్ బాగా ప్లస్ అవుతోంది.