Begin typing your search above and press return to search.

ఇలియానాపై అన‌ధికారిక బ్యాన్ విధించారా?

By:  Tupaki Desk   |   8 Jun 2021 2:30 PM GMT
ఇలియానాపై అన‌ధికారిక బ్యాన్ విధించారా?
X
టాలీవుడ్ లో దశాబ్ధం పైగా కెరీర్ ని సాగించిన ఇలియానా ఉన్న‌ట్టుండి ముంబై ప‌రిశ్ర‌మ‌కు వెళ్లిపోవ‌డం అప్ప‌ట్లో ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అక్క‌డ వ‌రుస‌గా హిందీ చిత్రాల్లో నటించినా కానీ ఆశించినంత‌ స్టార్ డమ్ చిక్క‌లేదు. బ‌ర్ఫీ లాంటి క్రేజీ సినిమాలో న‌టించినా కానీ ఎందుక‌నో ఆ త‌ర్వాత పెద్ద రేంజు స్టార్లు త‌న‌ని ఎంపిక చేయ‌లేదు.

ఆ క్ర‌మంలోనే ఇలియానా తిరిగి తెలుగు-త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో ప్ర‌య‌త్నించింది. ర‌వితేజ‌తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ద‌క్కిన అవ‌కాశం. కానీ దానిని స‌ద్వినియోగం చేసుకోలేని ప‌రిస్థితి. ఏదేమైనా ఇలియానా ఇటీవ‌ల తెలుగు-త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల్లో క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అంటే.. అస‌లు విష‌యం తెలిసింది.

ఇలియానాపై త‌మిళ చిత్ర‌సీమ నిషేధం విధించింది. దానికి కార‌ణం ఒక అగ్ర నిర్మాత‌. అక్క‌డ ఓ సినిమాకి క‌మిటై అడ్వాన్స్ తీసుకుని చివ‌రికి అత‌డికి హ్యాండివ్వ‌డంతో స‌ద‌రు నిర్మాత కోలీవుడ్ ఫిలింఛాంబ‌ర్ లో ఫిర్యాదు చేశారని కొన్ని క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అలాగే టాలీవుడ్ నిర్మాత‌ల మండ‌లిని ఫిలిం ఛాంబ‌ర్ ని ఆయ‌న నిషేధం కోరుతూ అభ్య‌ర్థించారు. బ‌హుశా అందుకే ఇలియానాకు లైన్ క్లియ‌ర్ కాలేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవ‌లే ఈ స‌మ‌స్య‌ను కూడా ఇలియానా ప‌రిష్క‌రించుకుంద‌ని త్వ‌ర‌లోనే ఇక్క‌డా న‌టించే అవ‌కాశం లేక‌పోలేదని తాజాగా తెలుస్తోంది. మొత్తానికి సుదీర్ఘ కాలం సౌత్ లో సినిమాలు చేయ‌లేక‌పోయిన‌ ఇలియానాకు ఎట్ట‌కేల‌కు లైన్ క్లియ‌రైన‌ట్టేన‌న్న‌మాట‌.