Begin typing your search above and press return to search.
'అనగనగా ఓ అతిథి' నుంచి పాయల్ 'మల్లిక' లుక్..!
By: Tupaki Desk | 30 Oct 2020 3:30 PM GMTతెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వంద శాతం తెలుగు ఫ్లాట్ ఫార్మ్ అంటూ వచ్చింది ''ఆహా'' ఓటీటీ. కరోనా సమయంలో కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లు మరియు కొత్త సినిమాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'ఆహా' ఇప్పుడు ''అనగనగా ఓ అతిథి'' అనే చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసింది. 'Rx 100' బ్యూటీ పాయల్ రాజ్ పుత్ - చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్ 13న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి చేతుల మీదుగా విడుదలైన 'అనగనగా ఓ అతిథి' ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లుక్ ని విడుదల చేసారు.
'అనగనగా ఓ అతిథి' చిత్రంలో పాయల్ రాజ్ పుత్ 'మల్లిక' అనే సాధారణ యువతి పాత్రలో కనిపించనుంది. ఈ పోస్టర్ లో పాయల్ చేతిలో లాంథర్ ని పట్టుకొని ఆ వెలుతురులో ఎవరి కోసమో చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహించారు. పేదరికంలో నివస్తున్న ఓ కుటుంబంలోకి అనుకోని ఓ అతిథి వచ్చిన తరువాత వారికి ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ పీరియాడిక్ థ్రిల్లర్ ఉంటుందని తెలుస్తోంది. దురాశ, కామం, అత్యాశ వంటి ఎలిమెంట్స్ కు ఎమోషనల్ డ్రామా - సస్పెన్స్ కలిపి ఊహించని మలుపులతో తెరకెక్కించిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని మూవీ టీమ్ తెలిపింది. ఈ చిత్రానికి అరోల్ కొరెల్లి సంగీతం అందించారు. 'అనగనగా ఓ అతిథి' చిత్రం నవంబర్ 13న 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది.