Begin typing your search above and press return to search.
ఈ సినిమాలకి సక్సెస్ మంత్ర అదే
By: Tupaki Desk | 7 March 2016 5:30 PM GMTచాలా సినిమాలు భారీ వసూళ్లు సాధించి కూడా చివరకు ఫ్లాప్ అనిపించుకోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సినిమాలను ఫ్లాప్ కేటగిరీలో కాకుండా కాస్ట్ ఫెయిల్యూర్ అనే లిస్ట్ లో చేరుస్తారు ట్రేడ్ అనలిస్టులు. గత అనుభవాలతో ఈ ఏడాది కాస్ట్ ని కంట్రోల్ చేసుకుని, మంచి లాభాలు అందుకున్న సినిమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన నేను శైలజ చిత్రాన్ని 10 కోట్లతో తీశారు స్రవంతి రవికిషోర్. ఈ చిత్రం కోసం రామ్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు. 20 కోట్ల థియేట్రికల్ వసూళ్లు సాధించిన నేను శైలజకి.. శాటిలైట్ - ఇతరాలు కలుపుకుంటే 25 కోట్ల వరకూ గిట్టుబాటు అయింది. సోగ్గాడే చిన్ని నాయన కోసం నాగ్ భారీగానే ఖర్చు చేయచ్చు. కానీ భాయ్ దెబ్బతో, చాలా జాగ్రత్తగా 15కోట్లతోనే సినిమా ఫినిష్ చేశారు. దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్ల వరకూ జరగ్గా.. చివరకు 45 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ అయింది. ఎక్స్ ప్రెస్ రాజా కోసం 8 కోట్లు వెచ్చించగా.. 13 కోట్లు వసూలయ్యాయి. శాటిలైట్ తో కలిపితే ఈ లెక్క 16 కోట్లు.
అడివిశేష్ మూవీ క్షణంను 1.1కోట్లతోనే తీయగా.. భారీ లాభాలు ఆర్జించిపెడుతోంది. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో 50 కోట్లకుపైగా వసూలు చేసినా కాస్ట్ ఫెయిల్యూర్ అన్నారు. ఒక వేళ ఈ మూవీని 40-45 కోట్ల మధ్య పూర్తి చేయగలిగితే.. ఇది కూడా బ్లాక్ బస్టర్ ల జాబితాలోనే ఉండేదనే మాట మర్చిపోకూడదు.