Begin typing your search above and press return to search.
బన్నీ .. విజయ్ దేవరకొండ ఇద్దరూ ఇద్దరే!
By: Tupaki Desk | 31 Oct 2021 7:30 AM GMTఆనంద్ దేవరకొండ తాజా చిత్రంగా 'పుష్పక విమానం' రూపొందింది. దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఆనంద్ దేవరకొండ సరసన నాయికలుగా గీత్ సైనీ .. శాన్వి మేఘన అలరించనున్నారు. సునీల్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, రామ్ మిరియాల .. సిద్ధార్థ్ సదాశివుని .. అమిత్ దాసాని సంగీతాన్ని సమకూర్చారు. 'కింగ్ ఆఫ్ ద హిల్' ప్రొడక్షన్స్ .. 'టాంగా ప్రొడక్షన్స్' వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను నవంబర్ 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వచ్చాడు.
వేదిక ముందు అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ కూర్చుని ఉండగా, ఆనంద్ దేవరకొండ వేదికపైకి చేరుకున్నాడు. ఆయన మాట్లాడుతూ .. "నాకు తెలుసు బన్నీ అన్నా డైరెక్టుగా షూటింగు నుంచి వచ్చారు. నా ముందు ఇప్పుడు ఇద్దరు క్రేజీ స్టార్స్ ఉన్నారు .. ఇద్దరిలో సిమిలర్ క్వాలిటీస్ ఏంటంటే కొంతమంది స్టైల్ అనీ .. మరికొంతమంది యాటిట్యూడ్ అని అంటారు. కానీ నా దృష్టిలో వీరిద్దరూ ఫ్రంట్ రన్నర్స్. ఎక్కువ రిస్క్ తీసుకుంటారు .. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. కాబట్టి ఇప్పుడున్న యంగ్ యాక్టర్స్ వీరిని ఫాలో అవ్వాలి.
బన్నీఅన్నా ఇక్కడికి రావడం ఈ సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకు నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. బన్నీ అన్నకు గుర్తుందో లేదో .. 'గీత గోవిందం' .. 'టాక్సీవాలా' సక్సెస్ మీట్ల సమయంలో మా అన్నయ్య నన్ను ఆయనకు పరిచయం చేశాడు. అప్పటికి నేను యాక్టర్ ను కాలేదు. 'మా తమ్ముడు ఆనంద్' అని మా అన్నయ్య పరిచయం చేయగానే, నేను 'హాయ్ అన్నా' అనేసి .. భయంతో పక్కకి వెళ్లిపోయాను.
అలాంటి నేను ఈ రోజున మీ ముందు మాట్లాడటానికి ఇంకా టెన్షన్ అవుతోంది .. కానీ మాట్లాడతా ఈ రోజు. మా అన్నయ్య నా పక్క రూమ్ లోనే ఉంటాడు కాబట్టి రోజు నాకు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. మిగతా వాళ్లు మీ ఇంటర్వ్యూస్ చూసి ఇన్స్పిరేషన్ పొందుతారు. ఒక వైపున బన్నీ అన్నను .. స్టైలిష్ స్టార్ .. ఐకాన్ స్టార్ అంటారు. ఇంకో వైపు మా అన్నను 'అర్జున్ రెడ్డి' .. 'లైగర్' .. 'రౌడీ' అంటూ ఉంటారు. ఇద్దరి మధ్యలో నేను .. నా పేరు చిట్టిలంక సుందర్ .. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ ని. గవర్నమెంట్ స్కూల్ టీచర్ ను కనుక నాకు నెలకు 20 వేలో ఎంతో వస్తుంది.
ఖర్చులు పోను ఒక పదివేలు మిగులుతాయి. అలా సరదాగా జీవితం గడిచిపోతుంటే, పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళదామని అనుకుంటే అంతా రివర్స్ లో కొట్టింది. నా పెళ్ళాం లేచిపోయింది. ఎక్కడికి పోయిందో .. ఏమై పోయిందో తెలియాలంటే నవంబర్ 12వ తేదీన థియేటర్స్ కి వెళ్లవలసిందే" అంటూ రొటీన్ కి భిన్నంగా అసలు మేటర్ లోకి వెళ్లాడు. "ఈ సినిమాలో మంచి కామెడీ ఉంటుంది .. సస్పెన్స్ ఉంటుంది .. మిస్టరీ ఉంటుంది. అందరూ థియేటర్స్ కి వెళ్లి చూడండి. తప్పకుండా అంతా ఎంజాయ్ చేస్తారు" అని చెప్పుకొచ్చాడు.