Begin typing your search above and press return to search.
హోమ్ ప్రొడక్షన్ లో దేవరకొండ బ్రదర్ మూడో సినిమా కూడా కంప్లీట్ అయిందా..?
By: Tupaki Desk | 19 Nov 2020 8:30 AM GMTటాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మూవీతో వస్తున్నాడు. వినోద్ అనంతోజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. నవంబర్ 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తన కెరీర్ కి బాగా ప్లస్ అవుతుందని ఆనంద్ నమ్మకంగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆనంద్ దేవరకొండ తన మూడో సినిమాని కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఆనంద్ దేవరకొండ మూడో ప్రాజెక్ట్ ని అన్న విజయ్ దేవరకొండ నిర్మించాడట. తన నిర్మాణ సంస్థ 'కింగ్ ఆప్ ది హిల్స్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ లో తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు 'మిడిల్ క్లాస్ మెలోడీస్' రిలీజ్ అయిన తర్వాత ప్రకటించనున్నారట. అయితే తమ్ముడి సినిమా తరువాత విజయ్ కొన్నాళ్లు ప్రొడక్షన్ కి దూరంగా ఉండబోతున్నాడట. ఈ సినిమా రిలీజ్ తరువాతే మరో సినిమా తన బ్యానర్ లో నిర్మించాలని విజయ్ డిసైడ్ అయ్యాడట. ఏదేమైనా తమ్ముడు ఆనంద్ ని హీరోగా నిలబెట్టాడనికి విజయ్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఆనంద్ మాత్రం.. అన్న విజయ్ పేరు తనకు ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ఉపయోగపడిందని.. సొంత ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని.. విజయ్ తమ్ముడిని అనే ఇమేజ్ ఉంది కదా అని కథలను ఎంపిక చేసుకోనని చెబుతున్నాడు.