Begin typing your search above and press return to search.
దొరసాని ముద్దుతోనే వస్తుందా?
By: Tupaki Desk | 3 April 2019 9:29 AM GMTవిజయ్ దేవరకొండ అంటే ఇప్పుడొక బ్రాండ్. పది సినిమాలు దాటకుండానే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోస్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడంటే చిన్న విషయం కాదు. గ్యారెంటీ ఓపెనింగ్స్ వచ్చే యూత్ హీరోస్ లో ఇతనే ముందున్నాడన్న మాట కూడా అతిశయోక్తి కాదు. ఇప్పుడు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ రాకకు రంగం సిద్ధమవుతోంది.
లుక్స్ పరంగా విజయ్ తో పోల్చుకుంటే కాస్త భిన్నంగా కనిపించే ఆనంద్ తెరమీద ఎలా చేశాడా అనే ఉత్సుకత అన్న అభిమానుల్లో చాలా ఉంది. దానికి తగ్గట్టే దొరసాని లాంటి డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీతో త్వరలోనే పలకరించబోతున్నాడు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యాయిందని సమాచారం. టీజర్ కూడా సిద్ధం చేశారట
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దొరసాని టీజర్ లో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్ ని హై లైట్ చేయబోతున్నారట. అర్జున్ రెడ్డితో మొదలుకుని డియర్ కామ్రేడ్ దాకా విజయ్ దేవరకొండ సినిమాల టీజర్లు పోస్టర్లు ఏదో ఒక రూపంలో లిప్ లాక్ ను చూపించి ప్రమోట్ చేసుకున్నావే. అన్నయ్య అందులో సక్సెస్ అయ్యాడు కాబట్టి తమ్ముడికి సైతం అదే ఫార్ములా అప్లై చేయబోతున్నట్టు తెలిసింది.
సోషల్ మీడియాలో ఇలాంటివి క్షణాల్లో వైరల్ అయిపోయి మిలియన్ల వ్యూస్ తెచ్చిపెట్టి హైప్ వచ్చేందుకు దోహదపడతాయి. ఇది ఎంతవరకు నిజమో దొరసాని టీజర్ వచ్చాక బయటపడుతుంది. అంచనాలు లేని దొరసాని మీద బజ్ రావాలి అంటే ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉపయోగించక తప్పదు