Begin typing your search above and press return to search.

బేబీ పై ట్రోల్స్.. హీరో సూపర్ కౌంటర్

By:  Tupaki Desk   |   8 July 2023 1:20 PM GMT
బేబీ పై ట్రోల్స్.. హీరో సూపర్ కౌంటర్
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఆమధ్య విడుదల చేసిన బేబీ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచడంలో విజయం సాధించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే సోషల్ మీడియాలో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.

కొన్ని సన్నివేశాలు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తరహాలో ఉన్నాయి అంటూ ట్రైలర్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇందులో చూపించిన లవ్ స్టోరీ చాలా సహజంగా ఈ తరం యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉందంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ట్రైలర్ విడుదల తర్వాత బేబీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చ సినిమా కి ఓపెనింగ్స్ ని తెచ్చి పెడుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ట్రైలర్ విడుదల తర్వాత వస్తున్నా ఫెయిర్ అండ్ లవ్లీ విమర్శలకు ఆనంద్ దేవరకొండ కౌంటర్ ఇచ్చాడు. సినిమా విడుదల కాకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. సినిమా చూసిన తర్వాత మాట్లాడాలని ట్రోల్స్ చేసిన వారికి ఆనంద్ దేవరకొండ సమాధానం చెప్పాడు.

ఈ సినిమాను గీత ఆర్ట్స్ కాంపౌండ్ కు చెందిన ఎస్కేఎన్ నిర్మించడం వల్ల ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. ఆయన సారధ్యంలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లుగా దర్శకుడు మరియు నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అల్లరించే విధంగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో వ్యాఖ్యలు చేస్తున్నారు.

సాయి రాజేష్ దర్శకుడిగా నిర్మాతగా వచ్చిన గత చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.