Begin typing your search above and press return to search.
నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది .. మీ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది!
By: Tupaki Desk | 8 Nov 2021 3:58 AM GMTఆనంద్ దేవరకొండ హీరోగా దామోదర దర్శకత్వంలో 'పుష్పక విమానం' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి వైజాగ్ లో జరిగింది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. 'పెళ్లి చూపులు' .. 'అర్జున్ రెడ్డి' చేసేటప్పుడు ఒక కొత్త యాక్టర్ గా నేను పడిన కష్టాలు .. ఆ తరువాత వచ్చేవాళ్లు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఈజీ ఫ్లాట్ ఫామ్ ఉండాలని చెప్పి ఒక ఎమోషన్ తో అప్పుడు సొంత ప్రొడక్షన్ పెట్టాను.
ఈ ప్రొడక్షన్ .. ప్రొడ్యూస్ చేయడం అంత తేలికైన పనేం కాదు. నిజంగా ఇది నెక్స్ట్ లెవెల్ పని. ప్రొడ్యూస్ చేయడమనేది చాలా రెస్పాన్స్ బిలిటీ .. ఒక వైపున నాకు సంబంధించిన పనులు చూసుకోవాలి. నా స్క్రిప్టులు .. నా ప్రిపరేషన్ .. నా మీటింగ్స్ తోనే నాకు సరిపోతోంది. ఇది నిజంగా 24X 7 జాబ్. రాత్రి పడుకుని కూడా వీటిని గురించి ఆలోచిస్తేనే నాకు వర్క్ అవుతుంది. అలాంటిది ఇంకో సినిమాకి సంబంధించిన పనులను చూసుకోవడమంటే అది ఇంకా పెద్ద రెస్పాన్స్ బిలిటీ. ఆ సినిమాను ప్రమోషన్స్ చేయడం మరొక ఎత్తు.
ఇంత బాధ్యత మీద పెట్టుకున్న తరువాత, ఒక్కోసారి 'అవసరమా మనకు' అనిపిస్తూ ఉంటుంది.
కానీ ఈ స్టేజ్ ఒక్కొక్కరు ఈ సినిమా ద్వారా తమకి అవకాశం వచ్చిందని మాట్లాడుతూ ఉంటే, ఈ ఎమోషన్ తోనే గదా మనం స్టార్ట్ చేసింది అనిపిస్తూ ఉంటుంది. కష్టమైనా ఫరవాలేదు .. ఇలాంటివారిని ఎంకరేజ్ చేయాలనిపిస్తోంది. రెండే విషయాలు నన్ను నడుపుతున్నాయి. ఒకటి .. అనుకుంటే నేను ఏమైనా చేయగలను అనే నామీదున్న నాకున్న కాన్ఫిడెన్స్. రెండవది మీమీదున్న ఓవర్ కాన్ఫిడెన్స్.
నేను ఏది చేసినా మీరు నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతారనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో కొట్టుకుంటూ వచ్చేస్తున్నా. ఈ రోజున 'పుష్పక విమానం' ఇంత అందంగా కనిపించడానికి కారణం ఇక్కడి యంగ్ టీమ్ కారణం. ఫ్లాట్ ఫామ్ నేను ఇచ్చిందే అయినా, దీని వెనుక ఉన్న కృషి అంతా కూడా ఇక్కడ ఉన్న టీమ్ దే. దర్శకుడు దామోదర నాకు చాలా కాలం నుంచి తెలుసు. అప్పుడే అనుకున్నాను ఆయనలో విషయం ఉందని. ఇంతకాలానికి ఇద్దరం కలిసి ఒక సినిమా చేయడానికి కుదిరింది. ఆయన ఫస్టు సినిమా నా బ్యానర్లో చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది" అంటూ చెప్పుకొచ్చాడు.