Begin typing your search above and press return to search.
వద్దు `బంగారం` అంటే చేతులు పట్టుకుని మొక్కాడు!
By: Tupaki Desk | 12 May 2021 12:30 AM GMTకొన్నిసార్లు పరిశ్రమలో స్నేహాలను కాదనలేని పరిస్థితి ఉంటుంది. కథ కంటెంట్ నచ్చకపోయినా రాజీకి వచ్చి సినిమాని అంగీకరిస్తే ఎలా ఉంటుందో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రుచి చూసారట. ఇంతకుముందు అతడు ధరణి దర్శకత్వంలో బంగారం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చేయను మొర్రో అని పవన్ వారించినా కానీ ధరణి వదిలి పెట్టలేదు. పైగా తమిళంలో హిట్టందుకుని ఇక్కడ పవన్ ని ఓ పట్టు బట్టడంతో ఆయన మొహమాటానికి బంగారం సినిమా చేశాడు. ఆ తర్వాత రిజల్ట్ తెలిసిందే.
ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ స్నేహితుడు .. కళాదర్శకుడు ఆనంద్ సాయి ఓ చిట్ చాట్ లో వెల్లడించారు. కథ విన్నప్పుడు లేదా షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా? అనేది మేం చర్చిస్తుంటాం. కథ ఎంపికలో గొప్ప తీర్పు ఉన్న పవన్ కళ్యాణ్ గెస్ ఎలా నిజమైందో వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ `బంగారం` కథ గురించి విని సెకండాఫ్ లో రకరకాల సందేహాలను లేవనెత్తాడు. తర్వాత నిర్మాత ఎ.ఎమ్.రత్నంతో మాట్లాడుతూ ఈ చిత్రం చేయడానికి తాను ఆసక్తిగా లేనని తెలిపారు. కానీ దర్శకుడు ధరణి తమిళ చిత్రంతో విజయం సాధించి పవన్ ను కలిశాడు. ``పవన్ కళ్యాణ్ చేతులను పట్టుకుని ఇవే కాళ్లుగా పరిగణించమని ధరణి అన్నాడు. చాలా హిట్స్ ఇచ్చిన తరువాత తనను నమ్మమని కోరాడు. పవన్ ఒక్క మాట కూడా చెప్పలేదు`` అని ఆనంద్ సాయి చెప్పారు. కానీ అంతిమంగా పవన్ ఊహించిందే జరిగింది. బంగారం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ఇక ఖుషీ-తమ్ముడు చిత్రాలకు పవన్ ఇచ్చిన ఇన్ పుట్స్ పెద్ద రేంజులో వర్కవుట్ అయ్యాయని కూడా ఆనంద్ సాయి వెల్లడించారు.