Begin typing your search above and press return to search.
మురుగదాస్ నే డైరెక్ట్ చేసే ఛాన్స్!
By: Tupaki Desk | 12 Sep 2018 4:21 AM GMTగురువులకే గురువు మురుగదాస్ కెప్టెన్ సీటుకే అంకితం అవ్వకుండా ఓ సినిమాలో నటిస్తున్నారంటే .. అదేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉంటుంది. అది కూడా ఓ తమిళ్- తెలుగు దర్శకుడు తీసే ద్విభాషా చిత్రంలో మురుగదాస్ నటించడం ఆసక్తి కలిగించకుండా ఉండదు. ఇంతకీ ఏ సినిమా?
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న `నోటా` చిత్రంలో మురుగదాస్ ఓ ఆసక్తికర పాత్రలో నటిస్తున్నారు. నోటా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా. ఇటీవలే రిలీజైన ట్రైలర్ కోటి వ్యూస్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో డైరెక్టర్ ఆనంద్ శంకర్ ఏరికోరి తన గురువు మురుగదాస్ చే ఓ రోల్ చేయిస్తున్నారు. అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి సంబంధించి బ్యాలెన్స్ సీన్స్ ని ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మురుగదాస్ పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారట. ఈ సందర్భంగా ఆనంద్ శంకర్ స్వయంగా ట్విట్టర్ లో మురుగదాస్ ఆన్ లొకేషన్ ఉన్నప్పటి ఫోటోని షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
``ఎంతటి ఆహ్లాదకరమైన సందర్భమిది! నా డైరెక్టర్‌నే నేను డైరెక్ట్ చేస్తున్నా.. ఆయన నటుడిగా.. నోటా సినిమా కోసం`` అంటూ ట్వీట్ చేశారు. ఇది యువదర్శకుడు ఆనంద్ కి అరుదైన ఛాన్స్. ఈ సందర్భంగా మురుగదాస్ నుంచి టిప్స్ ఏవైనా తీసుకునే అవకాశం దొరికిందేమో! ఆనంద్ శంకర్ ప్రఖ్యాత ప్లే రైటర్ - జాతీయ అవార్డు గ్రహీత కోమల్ స్వామినాథన్ కుమారుడు. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి దర్శకత్వం వైపు అడుగులు వేశారు. అంజానా అంజానీ (2010) సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేసి - అటుపై తుపాకి (తుప్పాక్కి-తమిళ్) - సెవెంత్ సెన్స్ ( 7ఏఎం ఆరివు) చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ గా ఆనంద్ శంకర్ పని చేశారు. ఇప్పుడు ఏకంగా గురువు మురుగదాస్ నే దర్శకత్వం వహించే ఛాన్స్ అందుకున్నారు.