Begin typing your search above and press return to search.
'నోటా' పుకార్లను కొట్టి పారేసిన దర్శకుడు
By: Tupaki Desk | 11 Sep 2018 5:51 AM GMTవిజయ్‌దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. ఈ సమయంలో ఈయన ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘నోటా’ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకే సమయంలో విడుదలకు సిద్దం అవుతుంది. వచ్చే నెల 4న విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించిన ఒక పుకారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత ‘నోటా’ సినిమాను మొదలు పెట్టారు. ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత విజయ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అందుకే ముందుగా అనుకున్న స్క్రిప్ట్ కు దర్శకుడు మార్పులు చేర్పులు చేశాడు అనేది ఆ పుకార్ల సారాంశం.
‘గీత గోవిందం’ చిత్రంతో విజయ్ దేవరకొండకు సాఫ్ట్ ఇమేజ్ వచ్చింది. అందుకే ‘నోటా’లోని పలు సీన్స్ ను రీ రైట్ చేసుకున్నాడని, విజయ్ దేవరకొండ ఇమేజ్ కు తగ్గట్లుగా స్క్రిప్ట్ ను మార్చాడు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు. తెలుగు మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. షూటింగ్ ప్రారంభంకు ముందే స్క్రిప్ట్ ను పూర్తి చేసేశాను. ఆ తర్వాత ఒక్క సీన్ కూడా రీ రైట్ చేసుకోవడం కాని, అందులో లేనిది కొత్తగా చేయడం కాని చేయలేదు. వందకు వంద శాతం ముందు రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం చేసుకు వెళ్లినట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చాడు.
‘నోటా’ చిత్రంపై ‘గీత గోవిందం’ చిత్రంకు ముందు పెద్దగా అంచనాలు లేవు. తెలుగులో గుర్తింపు లేని దర్శకుడు ఆనంద్ శంకర్ తో విజయ్ దేవరకొండ మూవీ అనప్పుడు అంతా కూడా పెదవి విరిచారు. కాని గీత గోవిందం చిత్రం తర్వాత ‘నోటా’ స్థాయి అమాంతం పెరిగింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే ఏ రేంజ్ లో సినిమా క్రేజ్ పెరిగిందో తెలిసి పోతుంది. తెలుగులో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం. ఇప్పుడు అందరి దృష్టి తమిళ ప్రేక్షకులను ‘నోటా’ ఏ స్థాయిలో అలరిస్తుందో అనే విషయంపై ఉంది.