Begin typing your search above and press return to search.

చిన్న చిన్న బట్టలు వేసుకోమని టార్చర్‌

By:  Tupaki Desk   |   13 Jun 2016 4:18 AM GMT
చిన్న చిన్న బట్టలు వేసుకోమని టార్చర్‌
X
బస్ స్టాప్ మూవీతో తెరంగేట్రం చేసిన తెలుగమ్మాయి ఆనంది.. ఆ తర్వాత 3-4 తెలుగు సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. ఇక్కడ ఆఫర్లు రాకపోవడం, వచ్చినవి నచ్చకపోవడంతో ఎంచక్కా చెన్నైకి మకాం మార్చేసింది. మొదటి సినిమా కాయల్ తోనే అవార్డును గెలుచునేంతటి ట్యాలెంట్ చూపించడంతో.. కోలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చేశాయి.

ప్రస్తుతం జీవీ ప్రకాష్ కి జంటగా నటించిన ఎనక్కు ఇన్నోరు ఇరుక్కు మూవీలో నటించింది ఆనంది. ఈ సినిమాకి ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్న ఈ భామ.. తను గతంలో నటించిన సినిమా డైరెక్టర్లపై ఘాటైన వ్యాఖ్యలే చేసేసింది. 'ఇంతకు ముందు నేను కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నా. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న బట్టలు వేసుకుని నటించమని టార్చర్ చేశారు. అవి చాలా అశ్లీలంగానే కాదు, అసహ్యంగా కూడా ఉన్నాయి. అలాంటి సీన్స్ చేయబోనని, షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించాల్సి వచ్చింది' అని చెప్పింది ఆనంది.

ఇంతకీ ఈ భామ చెప్పేదేంటంటే.. తన బాడీ షేప్ కి గ్లామర్ డ్రస్సులు అసలు నప్పవంటోంది. అందుకే చిన్న చిన్న దుస్తులు - టూపీస్ లు వేసుకోబోనని తేల్చేస్తుంది. ఈ విషయాన్ని సినిమా ఒప్పుకునేప్పుడే క్లారిటీ ఇచ్చేస్తుందిట. అయినా సరే కొంతమంది తర్వాత ఒత్తిడి చేశారని చెప్పింది. అయితే.. ఇప్పుడు చేస్తిన ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు యూనిట్ మాత్రం.. తనను చాలా బాగా చూసుకుందని అంటోంది.