Begin typing your search above and press return to search.
రాజమౌళి అలా ఫ్లాట్ అయిపోయాడు
By: Tupaki Desk | 26 Oct 2016 4:20 AM GMTఅనంత శ్రీరామ్.. చాలా చిన్న వయసులోనే లిరిసిస్టుగా మంచి పేరు సంపాదించాడు. టీనేజీలోనే సినిమా పాటలు రాయడం మొదలుపెట్టి.. 32 ఏళ్ల వయసుకే 800కు పైగా పాటలు రాసిన ఘనుడతను. అలాగని ఏవో చిన్నాచితకా సినిమాలకు రాస్తాడంటే అదీ కాదు. తెలుగులో పెద్ద పెద్ద దర్శకులతో భారీ సినిమాలే చేస్తుంటాడు. అందులోనూ రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడిని మెప్పించి వరుసగా ఆయన సినిమాల్లో పాటలు రాయడం అంటే చిన్న విషయం కాదు. మరి రాజమౌళిని అనంతశ్రీరామ్ తొలిసారి ఎలా మెప్పించాడో అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘రాజమౌళి గారితో తొలిసారి ‘యమదొంగ’ సినిమాకు పని చేశాను. ‘యమదొంగ’ మ్యూజిక్ సిట్టింగ్స్ అరకు వ్యాలీలో జరిగాయి. అప్పటికి కీరవాణి గారు రాజమౌళికి 20 ట్యూన్స్ ఇచ్చారు. అవన్నీ తిరస్కరణకు గురయ్యాయి. దీంతో మంచి పాట రాస్తే దానికి ట్యూన్ కడతానంటారు. నా దగ్గరున్న మూడు పాటలు వినిపించాను. అందులో ఒకటి రబ్బరు గాజులు.. ఆ పాట విన్న రాజమౌళి నాకు పాట అలా ఉండాలి అన్నారు. ఐతే ఆయన ఎక్కువ ఇంప్రెస్ అయింది యంగ్ యమా అనే పదబంధం దగ్గర. యమదొంగ సినిమా సమయానికి నేను లోకానికి తెలియని రచయితను. ఆ సమయంలో యంగ్ యమ అనే ఒక్క పదం ప్రయోగించినందుకు ఆ సినిమాలో ఐదు పాటలు నాతోనే రాయించారు. రాజమౌళి గారి సినిమాల్లో ‘బాహుబలి’లోని పచ్చబొట్టేసినా.. పాటకు అత్యధిక సమయం పట్టింది. ఈ పాట రాయడానికి 72 రోజులు తీసుకున్నా. ఐతే డబ్బు కూడా ఎక్కువే అందింది’’అని అనంత శ్రీరామ్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/