Begin typing your search above and press return to search.

మాల్ ఎరేంజ్ చేస్తానన్నందుకు ఆమెను వదలట్లేదు

By:  Tupaki Desk   |   26 Oct 2021 11:20 AM GMT
మాల్ ఎరేంజ్ చేస్తానన్నందుకు ఆమెను వదలట్లేదు
X
షారుఖ్‌ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ అవ్వడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సాదారణంగా అయితే ఇంతటి హై ప్రొఫైల్‌ సెలబ్రెటీ కుటుంబంకు చెందిన వారు అరెస్ట్‌ అయితే వెంటనే సెటిల్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. కాని ఈసారి మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. అది ఎందుకు అనేది రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఆర్యన్ ఖాన్‌ మాత్రమే కాకుండా ఆయనతో లింక్ లో ఉన్న చాలా మంది కూడా ఈ కేసులో బుక్ అయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆర్యన్ ఖాన్ కు స్నేహితురాలు అయిన అనన్య పాండే కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కొంటోంది.

ఇప్పటికే అనన్య పాండేను ఎన్ సీ బీ అధికారులు విచారించారు. ఈ వారంలో మరోసారి ఆమెను విచారించేందుకు సిద్దం అయ్యారు. నిన్ననే అనన్య విచారణకు హాజరు అవ్వాల్సి ఉండగా అనారోగ్య కారణంగా విచారణకు రాలేక పోతున్నట్లుగా పేర్కొంది. ఆ తర్వాత ఆమె కు మళ్లీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆమెను మళ్లీ మళ్లీ విచారించడం ద్వారా ఏం రాబట్టాలని ఎన్‌ సీ బీ అధికారులు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు. ఆర్యన్‌ ఖాన్‌ వాట్సప్‌ చాట్‌ లో అనన్య పాండేతో మాల్‌ ఉందా అంటూ అడిగాడు.. ఇంటికి రా తప్పకుండా ఎరేంజ్ చేస్తాను అంటూ అనన్య రిప్లై ఇవ్వడం కూడా జరిగింది.

ఎరేంజ్ చేస్తానంటూ చెప్పావు కదా ఎలా ఎరేంజ్ చేస్తావు.. అసలు మాల్‌ అంటే డ్రగ్స్‌ అవునా కాదా అనేది ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు తాను సరదాగా ఆర్యన్ తో అన్నాను. మేము ఇద్దరం మంచి స్నేహితులం. ఎప్పుడు కూడా ఆట పట్టించుకుంటూ ఉంటాం. ఆ విషయంలో నన్ను అనుమానించవద్దంటూ విచారణ సమయంలో అనన్య కన్నీరు పెట్టుకుందట. ఇప్పటికే అనన్య ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. అయినా ఇప్పటి వరకు ఆమె పై డౌట్ కంటిన్యూ అవుతూనే ఉందని అంటున్నారు.