Begin typing your search above and press return to search.

లాక్మే ఫ్యాష‌న్ ర్యాంప్ పై `లైగ‌ర్` భామ మెరుపులు

By:  Tupaki Desk   |   28 March 2022 4:30 PM GMT
లాక్మే ఫ్యాష‌న్ ర్యాంప్ పై `లైగ‌ర్` భామ మెరుపులు
X
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టెంప్టింగ్ పోజుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా బ్యూటీ మంటలు రేపడం షరా మామూలే. డిజైనర్ దుస్తుల్లో తమదైన గ్లామ్ తో యువతని ఆకట్టుకుటుంది. ఆల్ర్టా మోడ్రన్ లుక్ లో అనన్య మెరుపులు విశ్వ వ్యాప్తమే. తాజాగా బ్యూటీ లాక్మే ఫ్యాష‌న్ వీక్ లో గ్రాండ్ ఫినాలే లో ర్యాంప్ పై త‌ళుక్కున మెరిసింది.

పింక్ క‌ల‌ర్ డిజైన‌ర్ దుస్తుల్లో బ్యూటీ షో స్టాప‌ర్ గా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ నెట్టింట వైర‌ల్ గా మారింది. లాక్మే వీక్ ని ఉద్దేశించి నెటి జ‌నులు ఆస‌క్తిక‌ర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. లాక్మే వీక్ గురించి అన‌న్య మాట్లాడుతూ`లాక్మేతో నా అనుబంధం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది. లాక్మే అబ్సొల్యూట్ గ్రాండ్ ఫినాలేలో నేను అరంగేట్రం చేసినప్పుడు గత సీజన్‌లో నాకు అద్భుతమైన అనుభవం ఎదురైంది. తుదిపోరులో ఫల్గుణి షేన్ పీకాక్ ధరించడానికి ఎదురుచూస్తున్నట్లు`` తెలిపింది. ఇంకా ఆమె మాట్లాడుతూ..

``ఈ సంవత్సరం నేను ఫల్గుణి షేన్ పీకాక్ యొక్క అద్భుతమైన డిజైన‌ర్ల‌ల‌లో ఒక‌దాని ధరించాను. వారి డిజైన్‌లు - లాక్మే అబ్సొల్యూట్ ఎక్స్‌ప్లోర్ ఐ కలెక్షన్‌తో వారు ఊహించినట్లుగా ప్రపంచంలోనే ఉత్త‌మ ఫ్యాష‌నిస్ట్ గా భాగం కావాలని ఎదురు చూస్తున్నాను. నా మేకప్ లుక్‌ని అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ప్రత్యేకించి రంగులు.. మెటాలిక్ ఫినిషింగ్‌ని మిస్ చేయలేని షేడ్స్‌లో స్ప్లాష్ చేస్తున్నాను ”అని చెప్పుకొచ్చింది.

'లైగర్' సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భామ్ విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తుంది. తెలుగ..హిందీ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కించారు. ధర్మ ప్రొడక్షన్స్-పూరి కనెక్స్ట్ సంయుక్తంగా నిర్మించాయి. బాలీవుడ్ లో చుంకీపాండే వారసురాలిగా అనన్య పాండే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రెండు..మూడు సినిమాల్లో నటించింది. ఇటీవలే విడుదలైన 'గెహ్రాయాన్' లో నూ అనన్య నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు అందుకుంటూ యువ భామగా వెలిగిపోతుంది.