Begin typing your search above and press return to search.

ఆ హీరోతో పనిచేయడం అనందంగా ఉంది!!

By:  Tupaki Desk   |   6 April 2020 10:00 AM GMT
ఆ హీరోతో పనిచేయడం అనందంగా ఉంది!!
X
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సంచలనం రేపిన హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా సినీ ఇండస్ట్రీ పై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. మొత్తం సౌత్, నార్త్ ఇండస్ట్రీలన్నీ అర్జున్ రెడ్డి పై కన్నేశాయి. ఆ సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర బాషా అభిమానులను కూడా ఆకర్షించుకున్నాడు. ఇదిలా ఉండగా విజయ్ పై సినీ అభిమానులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం మనసు పారేసుకోవడం విశేషం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఫైటర్'.

తెలుగు, హిందీతో పాటు ఇతర భాషలలో రూపొందుతున్న ఈ సినిమాను పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా హీరోయిన్ అనన్య హీరో విజయ్ ని తెగ పొగిడేస్తోందట. విజయ్ చాలా మంచి మనిషి. నాకు అసలు సౌత్ ఇండస్ట్రీ గురించి ఏం తెలీదు. విజయ్ రోజు ఏదోకటి చెప్తూ ఉంటాడు అంటోంది అమ్మడు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే ఫైటర్ లోని ఓ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశారట. ఈ సందర్భంగా విజయ్ తో నటించిన అనన్య మాట్లాడుతూ.. విజయ్ పెద్ద స్టార్ అయినప్పటికీ ఎప్పుడు కూడా ఆ ఆటిట్యూడ్ చూపించలేదు. ఎన్నో కొత్త విషయాలు చెప్తూ జోవియల్ గా ఉంటారు. ఇలాంటి మంచి కోఆపరేటివ్ మనిషి పక్కన నటించడం చాలా అనందంగా ఉందంటూ సిగ్గు పడుతోందట సొగసరి అనన్య. ఈ సినిమాను పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం.