Begin typing your search above and press return to search.
VD పిరికివాడు అంటూ హీరోయిన్ కామెంట్
By: Tupaki Desk | 19 Feb 2022 11:30 PM GMTటాలీవుడ్ రైజింగ్ హీరో .. పాన్ ఇండియా స్టార్ డమ్ ని అందుకోబోతున్న హీరో విజయ్ దేవరకొండపై బాలీవుడ్ యువనాయిక అనన్య సరదా కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. లైగర్ కోస్టార్ గా అతడిని దగ్గరగా పరిశీలించిన అనన్య పాండే.. వీడీ తెరపై కనిపించేదానికి బయట పూర్తి భిన్నంగా ఉన్నాడని తెలిపింది. అంతేకాదు.. అతడు సహజంగా పిరికివాడు అని కూడా అంది. అయితే ఒక నటిగా తనకు కావాల్సినంత సౌకర్యాన్నిచ్చిన మనోహరమైన వ్యక్తి అని కూడా కితాబిచ్చేసింది.
విజయ్ దేవరకొండ తన తొలి పాన్-ఇండియా చిత్రం లైగర్ లో అనన్య పాండే హాటెస్ట్ రోల్ తో హీట్ పెంచనుంది. దేవరకొండతో తన వర్క్ ఎలా ఉంది? అన్న ప్రశ్న అడగ్గానే పైవిధంగా స్పందించింది. నిజ జీవితంలో అతను పోషించే పాత్రలకు పూర్తి ఆపోజిట్ గా ఉన్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేసింది అనన్య పాండే. ``వీడీ నటించిన అర్జున్ రెడ్డి చూశానని ఆ మూవీ చాలా నచ్చిందని తెలిపింది. నిజానికి అతను పోషించే పాత్రలకు చాలా భిన్నంగా ఉన్నాడు. అతను చాలా పిరికివాడు. నిశ్శబ్దంగా మనోహరమైన వ్యక్తిగా కనిపిస్తాడు. గొప్ప సహనటుడిగానే కాకుండా సెట్స్ లో నన్ను ఇంత సౌకర్యంగా ఉంచినందుకు అతనికి ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను`` అని అనన్య చెప్పారు.
లైగర్ అన్ని అంశాల మేలు కలయికతో తెరకెక్కిన చిత్రం. ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జానర్ లు ఉన్నాయని అనన్య తెలిపింది. పైసా వసూల్ చిత్రమిదని కూడా చెప్పింది. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టుగా నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం.. వరల్డ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ ఇందులో ఓ కీలక పాత్రతో మెరిపించనున్నాడు. 2019 లో ప్రకటించాక.. మహమ్మారి కారణంగా చిత్రీకరణ ఆలస్యమైందని ఎట్టకేలకు నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయని కూడా వెల్లడించింది. ఈ చిత్రం 25 ఆగస్ట్ 2022న విడుదల కానుంది.
గెహ్రయాన్ తో క్యూటీ రేంజు పెరిగింది!
అనన్య పాండే కెరీర్ లో మరో బెస్ట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. తన గురువు దీపికా పదుకొణెతో కలిసి నటించిన గెహ్రయాన్ తనకు పేరును తెచ్చింది. సిద్ధాంత్ చతుర్వేది.. ధరియా కర్వా ఇందులో కథానాయకులు. గెహ్రైయాన్ ఇటీవలే OTT లోకి వచ్చింది. శకున్ బాత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. తిట్టేవాళ్లు ఉన్నా నటీమణుల ప్రదర్శనను పొగిడేవాళ్లే ఎక్కువ. బోల్డ్ కంటెంట్ లో జీవించింది దీపిక. తనతో పోటీపడి నటించింది అనన్య అంటూ పొగిడేశారు. ఆర్టిస్టుల పరంగా అభిమానులు విమర్శకుల నుండి మంచి సమీక్షలు దక్కాయి. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ మొబైల్ ఫోన్ లకు అతుక్కునేలా చేసింది.
గెహ్రైయాన్ విడుదల తర్వాత అనన్య రేంజు పెరిగింది. నటిగా అద్భుతమైన పరిణతిని ఎదుగుదలని చూపించింది. తన నటన అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకోవడం ఆశ్చర్యకరమైన అంశం. నసీరుద్దీన్ షా- దీపికా పదుకొణె-రజత్ కపూర్ వంటి అనుభవజ్ఞుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. పరిశ్రమ అగ్ర మీడియా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న తరువాత నెటిజనులు అనన్య పాండే తన అద్భుతమైన నటనను మెచ్చుకోవడంలో వెనుకంజ వేయలేదు.
పాండేను `తియా` అంటూ నెటిజన్లు పొగిడేస్తూ అభివర్ణించడం సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. #అనన్యపాండే మీరు ప్రవర్తించే విధానంలో మీరు చాలా వాస్తవికంగా నిజాయితీగా ఉన్నారని నేను భావిస్తున్నాను. అంతగా ఆకట్టుకుంది. @అనన్యపాండేయ్ #గెహ్రైయాన్ అంటూ పొగిడేశారు.