Begin typing your search above and press return to search.

చినుగుల డెనిమ్ లో `లైగ‌ర్` భామ సెగ‌లు!

By:  Tupaki Desk   |   21 Sep 2021 12:30 PM GMT
చినుగుల డెనిమ్ లో `లైగ‌ర్` భామ సెగ‌లు!
X
`లైగ‌ర్` చిత్రంతో బాలీవుడ్ భామ అన‌న్యాపాండే టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆరంభ‌మే డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఛాన్స్ అందుకోవ‌డంతో సినిమా స‌క్సెస్ అయితే టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేయడం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే బాలీవుడ్ బాగా ఫేమ‌స్ అయింది. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్` చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు అక్క‌డ బిజీ న‌టిగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం అక్క‌డ రెండు చిత్రాల్లో న‌టిస్తుండ‌గానే టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. లైగ‌ర్ లో పూరి ఇచ్చే ఎలివేష‌న్స్ తో అన‌న్య యూత్ ని ఊపేయ‌డం ఖాయం.

హాటెస్ట్ ఫోజులంటే చెల‌రేగిపోయే ఈ క్యూట్ భామ‌కు పూరి లాంటి క్రియేట‌ర్ తోడైతే ఎలివేష‌న్స్ ఏ రేంజులో వ‌ర్క‌వుట‌వుతాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ఇన్ స్టాలో భారీగా పాలోవర్స్ ని క‌లిగి ఉన్న అన‌న్య‌కు తెలుగులో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఏర్ప‌డ‌నుంది. ఎప్ప‌టిక‌ప్పుడు బికినీ..టూపీస్ ల్లో ర‌చ్చ చేసే అన‌న్య ఈసారి ఏకంగా ట్రావెల్ ఫిట్ వైట్ స్పోర్స్ట్ లో కాక‌లు రేపుతోంది. అన‌న్య మాల్దీవులు ట్రిప్ ని ముగించుకుని ఇంటికి చేరుకుంటోన్న స‌మ‌యంలో కెమెరాకి ఇలా చిక్కింది. టాప్ లో వైట్ స్పోర్స‌ట్ బ్రా తో ఆమె టోన్డ్ అబ్స్ ఎలివేట్ అయింది. బాట‌మ్ లో కేవ‌లం నిక్క‌రు మాత్ర‌మే ధ‌రించింది. దాన్ని క‌వ‌ర్ చేస్తూ ప్రింటెడ్ బ్లూ డెనిమ్ తో క‌వ‌ర్ చేసింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. అన‌న్య ఫాలోర్స్ త‌మ‌దైన శైలి కామెంట్ల‌తో మంటెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే అన‌న్య మాల్దీవులు ఫోటోలు వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఒంట‌రిగా బీచ్ లో చిలౌట్ అవుతోన్న కొన్ని ఫోటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. తాజాగా స్పోర్స్ట్ లుక్ లో మంట‌లు రేప‌డం చ‌ర్చ‌కొచ్చింది.