Begin typing your search above and press return to search.

లైగ‌ర్ బ్యూటీ సైబ‌ర్ క్రైమ్ బాధితురాలు?

By:  Tupaki Desk   |   28 Feb 2023 9:30 PM IST
లైగ‌ర్ బ్యూటీ సైబ‌ర్ క్రైమ్ బాధితురాలు?
X
బాలీవుడ్ అందాల క‌థానాయిక అనన్య పాండే కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. క‌ర‌ణ్ జోహార్ ఈ భామ‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌గా.. లైగ‌ర్ సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. కానీ లైగ‌ర్ ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోగా డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ ని అందించింది. దీంతో అన‌న్య నిరాశ‌కు గురైంది. త‌దుప‌రి ఈ భామ ఏ సినిమాలో న‌టిస్తోందో స‌రైన అప్ డేట్ లేదు.

తాజాగా అనన్య పాండే తన ఇన్ స్టాగ్రామ్ లో సినిమా షూటింగ్ పూర్తయినట్లు సంతోషకరమైన వార్తను అభిమానుల‌తో షేర్ చేసింది. అంతేకాదు ముగింపు ఉత్స‌వంలో తీవ్ర‌ భావోద్వేగానికి గురైంది. విక్రమాదిత్య మోత్వానే తో తన ఫోటోని షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. "నేను మీకు ఎప్పటికీ తగినంత కృతజ్ఞతలు చెప్పలేను. కానీ మిమ్మల్ని సంతోషపెట్టేలా గర్వించేలా చేస్తాను. ఈ మాయా చిత్రానికి మీ అనుభ‌వాల‌ను ప్రతిదీ జోడించి ప‌ని చేసారు. ఈ బృందంలోని ప్రతి ఒక్క సభ్యుడిని ప్రేమిస్తున్నాను. నేను చేయగలను. ప్రపంచం నా సినిమా చూసే వరకు వేచి ఉండలేను" అని వ్యాఖ్యానించింది. సైబర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ .. ఫస్ట్ లుక్ ని త్వరలో విడుదల చేయనున్నారు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2- పతి పత్నీ ఔర్ వో- అంగ్రేజీ మీడియం- ఖ‌లీ పిలీ- లైగ‌ర్ చిత్రాల్లో న‌టించిన పాండే గాళ్ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. డ్రీమ్ గ‌ర్ల్ 2లో ఆయుష్మాన్ ఖురానా స‌ర‌స‌న న‌టిస్తోంది. 'ఖో గయే హమ్ కహాన్' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. యూత్ లో భారీ క్రేజ్ ఉన్న ఈ భామ సినిమాల కోసం భారీ పారితోషికం అందుకుంటోంది. అలాగే ఒక్కో బ్రాండ్ ప్ర‌మోష‌న్ కోసం కోట్ల‌లో ప్యాకేజీలు అందుకుంటోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.