Begin typing your search above and press return to search.
లైగర్ బ్యూటీ మెడలో ఆ క్రిస్టల్ హారం ఖరీదెంత?
By: Tupaki Desk | 13 May 2021 3:30 AM GMTలైగర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెడుతోంది బాలీవుడ్ కిల్లర్ లేడీ అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ .. కలీ పీలీ లాంటి చిత్రాలతో కుర్రకారు గుండెల్ని దోచేసిన ఈ అమ్మడు తనదైన ఒరవడితో యూత్ ని కిల్ చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఓ ఫోటో మతి చెడగొడుతోంది. అనన్య క్యూట్ లుక్స్ కి తగ్గట్టే మెడలో ఆ డిజైనర్ హారం ఎంతో ముచ్చటగొలుపుతోంది. పింక్ డిజైనర్ ఫ్రాక్ కి తగ్గట్టే క్రిస్టలైన్ హారం ధగధగలు ఆకర్షిస్తున్నాయి.
ఇక ఈ అమ్మడు ఉపయోగించే కాస్ట్యూమ్స్ కానీ.. ఆభరణాల ఖరీదు కానీ హ్యాండ్ బ్యాగ్ కాస్మోటిక్స్ వగైరా వాటి కోసం నెలవారీగా లక్షల్లో బిల్లులు వస్తున్నాయట. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే వారసురాలిగా అనన్య రంగ ప్రవేశం చేసినా తనదైన మార్క్ వేస్తూ దూసుకుపోతోంది. తనకు పారితోషికం కూడా కోట్లలో ముడుతోంది. అనన్య తొలి పాన్ ఇండియా మూవీ లైగర్ లో నటిస్తోంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి పూరి దర్శకుడు. కరణ్ జోహార్- పూరి- ఛార్మి నిర్మిస్తున్నారు. కోవిడ్ వల్ల చిత్రీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే.